కరోనాపై శతక పద్య శంఖారావం

  ప్రపంచ మానవాళి మనుగదను ప్రశ్నించిన అతిపెద్ద అవరోధం కరోనా. కారణాలు ఏవైనా కరోనా కనికరం లేకుండా ప్రాణాలను కబళించి అనేక ఆలోచనలకు తెరలేపింది. ‘మనిషి ప్రకృతికి అధిపతి కాదు. ప్రకృతిలోని జీవకోటిలో ఒకానొక జీవి మాత్రమే. తన ఇష్టానుసారం ప్రకృతిని కలుషితం చేసే నాశనం చేసే హక్కు అతనికి లేదు. ఒకవేళ కాదని మనిషి అలా చేస్తే తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అవుతుందని చాటి చెప్పడానికి ప్రకృతి పంపిన హెచ్చరిక సందేశమే ఈ […] The post కరోనాపై శతక పద్య శంఖారావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రపంచ మానవాళి మనుగదను ప్రశ్నించిన అతిపెద్ద అవరోధం కరోనా. కారణాలు ఏవైనా కరోనా కనికరం లేకుండా ప్రాణాలను కబళించి అనేక ఆలోచనలకు తెరలేపింది.

‘మనిషి ప్రకృతికి అధిపతి కాదు. ప్రకృతిలోని జీవకోటిలో ఒకానొక జీవి మాత్రమే. తన ఇష్టానుసారం ప్రకృతిని కలుషితం చేసే నాశనం చేసే హక్కు అతనికి లేదు. ఒకవేళ కాదని మనిషి అలా చేస్తే తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అవుతుందని చాటి చెప్పడానికి ప్రకృతి పంపిన హెచ్చరిక సందేశమే ఈ కరోనా’ అంటూ పద్యశంఖారావం పూరించారు చిగురుమళ్ళ శ్రీనివాస్. 4 ఏప్రిల్ 2020న న్యూయార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ఆవిష్కరించిన ఈ కరోనా శతక పద్యాలలో రచయిత శ్రీనివాస్ ఎన్నో వాస్తవాంశాలను విశ్లేషించి చూపారు.

ఆత్మబలంతో అడుగు ముందుకే వేయాల్సిన మనిషి వేస్తున్న తప్పటడుగులు ప్రకృతి సమత్యులతను దెబ్బతీస్తే కరోనా వంటి అనూహ్య వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఏర్పడుతున్న విషమ దుస్థితిని తేటతెల్లంగా రచయిత చెప్పారు. ‘జయము మనదే! దిగ్విజయము మనదే!’ అన్న మకుటంతో ‘కరోనా శతక’ పద్యాలు ఎన్నెన్నో విశ్లేషణలకు దారులు వేస్తాయి. సంక్లిష్ట సమయాలు, సంక్షోభ కాలాలు ఉప్పెనలలాంటివి. మనుషులను ప్రకృతికి దూరంగా ఇళ్లకే ఎందుకు కరోనా పరిమితం చేస్తున్నట్టు. ప్రాణభయాన్ని పెంచుతూ వాస్తవ పాఠాలను ఎందుకు నేర్పుతున్నదో తెలుసుకోవడం తక్షణ అవసరమని రచయిత అభిప్రాయపడ్డారు. నీరు, ఆకాశం, చెట్లు, జీవరాశులు అన్నీ మనిషి వేదనకు గురై అతనిలో మార్పును ఆకాంక్షించే క్రమంలో ఎదురైన విపత్కర అనుభవమే ఈ పరిస్థితి అంటారు రచయిత.

ప్రకృతి శక్తుల నిరసనను మనిషి ఇప్పటికైనా గమనించాలంటారు. అగ్రరాజ్యం, అల్పరాజ్యం, ఉన్నప్పుడు, పేదవాడు, రాజు, బంటు అనే తేడా సమానత్వ సమసమాజం రావాలని ఎల్లలు చెరిపి ప్రపంచానికి కరోనా సందేశమిచ్చిందంటారు. అకృత్యాలన్నీ ఆగిపోయి ప్రశాంతతో మానవ సమాజం ఆలోచించే అవకాశం ఏర్పడిందని చెప్పారు. జనమంతా ఒకటే అన్న జగదేవ సందేశం కరోనా చెప్పిందంటారు. విపత్తు ఇచ్చి వెళ్లే సందేశంలో భవిష్యత్తును జాగ్రత్తగా రూపొందిచుకోవాలన్న వినమ్ర వినతిని ఈ శతక పద్యాలు మానవ సమాజానికి ఇచ్చాయి.

“ఘన సునామిలెన్నొ కలి తుఫానులెన్నొ
కాటకములనెన్నొ కరువెలన్నొ
ఎదిరి ఎగిరి పారి ఎదిగిన జాతికి
జయము మనదె ! దిగ్విజయము మనదె!”
నిజమే ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొన్న మానవాళికి కరోనా తప్పక తలవంచాల్సిందే..
“కానరాదు దాన్ని కట్టివేయుటకును
బయటపడదు దాని పట్టుటకును
దాగుకొనుటయె రహదారి మనకు మరి
జయము మనదె! దిగ్విజయము మనదె!”
కరోనాను కట్టడి చేయాలంటే ఇంటి పట్టున ఉండి తీరాల్సిందే….
“సహన గుణము వలయు సంక్లిష్ట సమయాన
సహన మొకటి వలయు సంశయాన
సహన మదియు వలయు సంకుల సమరాన
జయము మనదె! దిగ్విజయము మనదె!”
ఇప్పటి సంక్లిష్టతకు ఒక సవహనం మాత్రమే శాశ్వత పరిష్కార మార్గం.
“చాటవలెను నేడు సంకల్ప సిద్ధిని
చాటవలెను నేడు సహన గుణము
చాటవలెను నేడు సమరశీలతలను
జయము మనదె! దిగ్విజయము మనదె!”
ప్రజల సంకల్ప సిద్ధితో కూడిన సమరశీలత ఈ ఉపద్రవాన్ని కనుమరుగు చేస్తుందన్నది రచయిత ప్రగాఢ విశ్వాసం
“పంచభూతములను పాడు చేసి మనిషి
అన్ని తనవె అనుచు అతిశయించ
కోవిదలను పంపె గొప్ప పాఠము చెప్ప
జయము మనదె! దిగ్విజయము మనదె!”
పర్యావరణం పరిరక్షణ ప్రాధాన్యతను మనిషి పాటిస్తే మనుగడకు అవరోధాలుండవన్న శాస్త్ర సత్యాన్ని ఈ శకత పద్యం చాటి చెప్పింది.
“ఇంటి బయటకొద్దు ఇంటి పట్టేముద్దు
రాకపోకలన్ని రద్దు రద్దు
పొరుగు ఇరుగు కసలు పోవద్దు రావద్దు
జయము మనదె! దిగ్విజయము మనదె!”
ఒంటరిగా ఇంటిపట్టున ఉండి చిందులేసే మహమ్మారి కరోనాకు ఆత్మ బలంతో బుద్ధి చెప్పమంటారు.
“ మందు సృష్టి చేయ ముందుకు రారండి
విజ్ఞలారా శాస్త్రవేత్తలార!
మానవులకు రక్ష మరి కరోనాకు శిక్ష
జయము మనదే! దిగ్విజయము మనదె!”
కరోనా అంతానికి అంతిమగీతం పాడేందుకు వైద్య విజ్ఞానం కదలి మానవ రక్షణ రేఖగా మారాలని ఆకాంక్షించారు.
“ ఎవరు కావగల్గు నీ జాతి నిప్పుడు
భక్తిముక్తి కాదు శక్తి కాదు
గడపదాట నట్టి క్రమశిక్షణొక్కటే
జయము మనదె! దిగ్విజయము మనదె!”
స్వీయ క్రమశిక్షణతో లక్ష్మణరేఖగా ఇంటిని మార్చుకుని విపత్తునుండి బయటపడాలన్న భావనను ఈ శతక పద్యాలు బలీయంగా వ్యక్తపరిచాయి. మనిషిలో పరివర్తనను సందేశించింది కరోనా ప్రకృతిని కాపాడడం ద్వారా తనను కాపాడుకొమ్మని వణికించిన కరోనా మహమ్మరిని తరిమేసే తరుణోపాయాలను ఈ శతకంలోని పద్యాలు అందించాయి.

                                                                                  – తిరునగరి శ్రీనివాస్, 8466053933

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై శతక పద్య శంఖారావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: