కూరెళ్ల పీఠికలు –విజ్ఞాన పేటికలు

  ఆచార్యులు, మధురకవి, చిక్కని వచన రచయిత, సద్విమర్శకులు, నిరంతర పరిశోధకులు, భాషావేత్త, చరిత్రకారులు, సామాజిక వేత్త, సంఘసంస్కర్త, సంఘటనాశీలి, పలురంగాలలోని వర్ధిష్ణువులకు వెన్నుదన్ను, మృదుభాషి, అభ్యుదయవాది, ఆధ్యాత్మికవేత్త కొలమానాలకందని మానవతావాది, సర్వజన సమదర్శి మొదలైన విశేషణాల కలపోత డా॥కూరెళ్ళ విఠలాచార్యగారు. షోడశ కళా పూర్ణుడై వెలిగే పౌర్ణమి చంద్రునిలా సాహితీరంగంలోని సర్వప్రక్రియల సారాన్ని నింపుకొన్న నిండైన మనీషులు ఆచార్య కూరెళ్ళ వారు. ఏ సాహిత్యవాదానికి కట్టుబడని మానవతా విలువల గని. సాహితీగంధం అంటిన, అంటించుకున్న ప్రతివారినీ […] The post కూరెళ్ల పీఠికలు – విజ్ఞాన పేటికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆచార్యులు, మధురకవి, చిక్కని వచన రచయిత, సద్విమర్శకులు, నిరంతర పరిశోధకులు, భాషావేత్త, చరిత్రకారులు, సామాజిక వేత్త, సంఘసంస్కర్త, సంఘటనాశీలి, పలురంగాలలోని వర్ధిష్ణువులకు వెన్నుదన్ను, మృదుభాషి, అభ్యుదయవాది, ఆధ్యాత్మికవేత్త కొలమానాలకందని మానవతావాది, సర్వజన సమదర్శి మొదలైన విశేషణాల కలపోత డా॥కూరెళ్ళ విఠలాచార్యగారు.

షోడశ కళా పూర్ణుడై వెలిగే పౌర్ణమి చంద్రునిలా సాహితీరంగంలోని సర్వప్రక్రియల సారాన్ని నింపుకొన్న నిండైన మనీషులు ఆచార్య కూరెళ్ళ వారు. ఏ సాహిత్యవాదానికి కట్టుబడని మానవతా విలువల గని. సాహితీగంధం అంటిన, అంటించుకున్న ప్రతివారినీ ఆదరించి అలరించే ఔదార్యమూర్తులు కూరెళ్లవారు. వజ్రాన్ని ఎన్ని కోణాలుగా సానబడితే అన్ని కిరణాలు ప్రసరించినట్లుగా వారినుండి ఏ జ్ఞానాంశం కోరినా దానిని ప్రతిఫలించే కాంతిపుంజం. ఇన్నిటి సారంగా ఒక్క మాటలో చెప్పాలంటే విజ్ఞానంలో బహుముఖ ప్రజ్ఞా శాలురు. వ్యవహారంలో పూర్ణపురుషులు. వీటితో విశిష్ట పీఠికా కారులుగా తెలంగాణ కవి, రచయితలెందరికో సాహితీ పథనిర్దేశం చేస్తున్న సాహిత్యకారులు. నా పరిశీలనలో ఇప్పటి వరకు వారి పీఠికలు సుమారు రెండువందల వరకు ఉన్నట్లు తేలింది.

పీఠిక: ముందుమాట, మున్నుడి, తొలిపలుకు, భూమిక, ఉపోద్ఘాతం, సింహావలోకనం, ప్రస్తావన, పరిచయం మొదలైన పేర్లతో ఆయా గ్రంథాలను అలంకరించింది. ఆంగ్లంలోని తీవవ? దానికి వీటిని సమనార్థకాలుగా భావించవచ్చు. లబ్ధప్రతిష్టు లైన సాహితీవేత్తలు కవి, రచయితతో గల అనుబంధాన్ని బట్టి ఆప్తచందనం, మిత్రవాక్యం, సుహృద్వాణి లాంటి శీర్షికలతో పీఠికలు రాస్తున్నారు. వీటిని బట్టి పీఠికా రచయితకు గ్రంథకర్తతో గల సాన్నిహిత్యం, గ్రంథం యొక్క అస్తిత్వం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒరవడిని కొనసాగిస్తున్న వారిలో కూరెళ్ళవారు ముందుంటారు. సాంప్రదాయికంగా వస్తున్న పీఠిక, ముందుమాట, తొలిపలుకులు అనికూడా గ్రంథంలోని ఇతివృత్తాన్ని బట్టి, ప్రక్రియను బట్టి పెట్టిన శీర్షికలే ఎక్కువ. ఉదా: కందం రాసినవాడే కవి, మనుమనికి మకుటం పెట్టిన తాతయ్య, వెంకన్న మేలుకొలుపు మొదలగునవి. కవి, రచయితతో గల ఆత్మీయతానుబంధాల్ని దృష్టిలో పెట్టుకొని పేరు పెట్టిన శీర్షికలు కొన్ని ఉదా: ఆప్తచందనం, స్నేహచందనం, మంచి మనిషిామంచిపుస్తకం, ఆత్మీయం, అభినందన చందనం మొ॥

కూరెళ్లవారితో ప్రత్యక్షపరిచయం కలిగినవారు సాహిత్యపరంగానో, సాన్నిహిత్యం ద్వారానూ ఎలాంటి ఆత్మీయతను అందు కుంటారో వీరి పీఠికలను చదివినా అదే అనుభూతిని పొందుతారు. వారి మాటల్లోని ఆకర్షణశక్తి, రాతల్లోని వశీకరణశక్తి అలాంటిది. సామాన్యుడి నుండి అసామాన్యుల వరకు అందించే వారి ‘అక్షరాలింగనం’ సమానభావంతో కూడిన అసమానమైనది. దీనిలోని మర్మమంతా వారి మనసులోని నిర్మలత్వం, భాషలోని సరళత్వం. పెద్దన కవిత్వం వలె పెద్దల(పండితుల)కు మాత్రమే గాక పలుకనేర్చిన ప్రతివాడికీ అర్థమయ్యే వేమనలా రాసే వీరి సరళశైలియే ప్రతివారితో వీరు జరిపే ‘అక్షరాలింగనం’గా చెప్పవచ్చు. వచన కవిత్వం జాత్యుపజాతులలోనే కాక వీరి భాష, శైలి వృత్తాలలో కూడా సరళంగా ఉంటుంది. తెలుగు జానపద సాహిత్య పితామహుడు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు “పద్యం రాయడంలో, గద్యం రాయడంలో మా కూరెళ్ళ సిద్ధహస్తులు” అని అన్నట్లు సరళమైన భాషలో ఒదగడమే సహజలక్షణం గల పీఠికల్లో వీరి భాష మరెంత సరళంగా, సుందరంగా ఉంటుందో వేరేగా చెప్పవలసిన పనిలేదు. దానకి తోడుగా మధురకవిగారు సమకూర్చే భావమాధుర్యం మరో మధురస్పర్శ. ఇలా వారి వచన రచనాశైలి పీఠికలలో సరళంగా ఉండి ప్రత్యక్ష పరిచయం కలవారినీ, పరిచయం లేనివారినీ సమానంగా ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో కావ్యేతి వృత్తం కన్నా వీరి పీఠికలే ఎక్కువగా పాఠకుల ప్రశంసలు పొందాయనడం అతిశయోక్తి కాదు.

ఉత్తమ కృతి నిర్మాణంలో కవి ఎంతగా తపన పడతాడో ఆ కృతి స్థాయిని నికషోపలం పట్టడంలో, సాహిత్యలోకంలో దాని స్థానాన్ని నిర్ధారించడంలో పీఠికాకారుడు కూడా అంతే కఠినతర పరిస్థితిని ఎదుర్కొంటాడు. వీరి పీఠికలను, ఆయా గ్రంథాలను సమన్వయపరిచి చూచినపుడు ఇతివృత్తం పట్ల వారు ఎంత మమేకమై రాశారో అవగతమవుతుంది. రచయిత అంతరంగంతో, కావ్యేతివృత్తంతో మమేకం కావడంతో పీఠికను రాయడంలో గల క్లిష్టతను అధిగమిస్తారు. వందకు అటో ఇటో పుటలు గల రచనకు ఓ పదిపుటలు పేరున్న కవి, సాహితీవేత్త పీఠిక బోనస్‌లా ఉపయోగపడుతుందనే కోవలోకి చేరకుండా వీరి ప్రతి పీఠిక పలు నూతన విజ్ఞానాంశాలతో అలరిస్తూ జిజ్ఞాసువుల మనోపీఠంపై అధిష్ఠిస్తుంది. తన గళం లేదా కలం నుండి వెలువడే ప్రతి పదం పరిశోధనకు మూలవస్తువుగా భాసిల్లాలనే తపనయే దీనికి కారణం. పీఠికల్లో ఇలాంటి రచనా విధానం విశ్వనాథ, మల్లం పల్లి, ఆచార్య పేర్వారం, ఆచార్య సి.నా.రె. లాంటి వారికే సాధ్యం. మచ్చునకు రెండు ఉదాహరణల ద్వారా కూరెళ్లవారి పరిశోధనాకృషిని పీఠిక ద్వారా మనకు ఎలా అందించారో గమనిద్దాం.

1. సహజకవి సూరోజు బాలనరసింహాచారిగారి “మహేశ్వర శతకం”నకు “కందం రాసినవాడే కవి”శీర్షికతో పీఠిక రాస్తూ ఏ ప్రాచీన కవికి ఏ ఛందం అభిమానమైనదో ఇలా వివరించారు.
నన్నయ ఉత్పలములు
పాల్కురికి సోమనాథుడు ద్విపదలు
తిక్కన కందములు
ఎర్రన గీతములు
శ్రీనాథుడు సీసములు
పోతన కందములు
పెద్దన మత్తేభములు
భట్టుమూర్తి శార్దూలం
వేమన ఆటవెలది
పాల్కురికి, శ్రీనాథుడు, వేమన విషయంలో కాక మిగతా కవుల అభిమాన పాత్రతను ఇలా నిర్ధారించడం
అంత సులువైన వ్యవహారం కాదు. సాహిత్యం పట్ల, ఆయా కవుల రచనల పట్ల ఎంతో లోతైన పరిశోధన,
పరిశ్రమ చేసి తగు పరిజ్ఞానం పెంపొందించుకున్న వారికే సాధ్యం. కూరెళ్లవారు ప్రతిక్షణం అక్షర సేద్యంలోనే గడుపుతారు. కాబట్టి ఇలాంటి రత్నాలు వెలికి తీయగలిగారు.

2. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వారు వెలువరించిన “ముచికుంద” అనే వార్షిక సంచికకు ఆచార్యుల వారు రాసిన “స్వస్తివాచనం” లో ఓ చారిత్రకాంశం పరిశీలించదగినది.
“ఈ ప్రాంతంలో పవిత్రమైన జీవనది ముచికుంద(మూసీ)నది ప్రవహిస్తుంది. దీని తీరంలోనే సుప్రసిద్ధ
ప్రాచీనాంధ్ర మహా నగరం “ఇంద్రపురి” ఉందని చరిత్ర చెబుతుంది. దీన్నే “ఇంద్రపాల నగరమ”నీ అంటారు.
?ది వి?ు?క?ండినులకు రాజధానిగా ఉండేదని ఇచట లభించిన శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ ప్రాంత
వైశిష్యం గూర్చి ప్రముఖ శాసనపరిశోధకులు బి.ఎన్. శాస్త్రిగారు అనేక పరిశోధనాంశాలను వెలుగులోకి తీసు కొచ్చారు.

రామన్నపేట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న “పెద్దతుమ్మలగూడెం” ఆనాటి ఇంద్రపాల నగరమేనని అనేక ఆధారాలతో శాస్త్రిగారు నిర్ధారణ చేశారు. ఈ ఆధారాలను అనుసరించి పెద్దతుమ్మల గ్రామీణులు ప్రభుత్వంతో పోరాటం చేసి వారి ఊరును “ఇంద్రపాల నగరం”గా మార్చుకున్నారు”.
పై పీఠికాంశాన్ని పరిశీలించినపుడు ప్రస్తుతం మూసుకుపోతున్న మూసీనది నేటి గోదావరి, కృష్ణా నదుల్లా ఒక ్పుడు జీవనదిలా పారిందని, దీని ఒడ్డున రాజమహేంద్రవరం, బెజవాడల్లాగా భాగ్యనగరం, ఇంద్రపాల నగరాలు విలసిల్లాయని భద్రాద్రి, శ్రీశైలం లాగా వాడపల్లి లాంటి శైవసంగమ క్షేత్రం ఆధ్యాత్మిక తీర్థక్షేత్రంలా భాసిల్లిందని తవ్విన కొద్దీ తెలంగాణలోని చారిత్రక ఆధారాలు బయట పడతాయనే అంశం తేటతెల్లమవుతుంది.

ఆచార్య కూరెళ్ళవారి పీఠికలలో సందర్భానుసారం అనేక విలువైన గ్రంథాల సమాచారంతో పాటు దేశదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విద్యాధికులు, పోరాటయోధులు, మహాత్ములు, ఆధ్యాత్మిక వేత్త లు మొదలైన వారి వివరాలు ఎన్నో లభిస్తాయి. ఇం కా కూరెళ్ళవారు విమర్శకులుగానే కాక గ్రంథకర్తలకు తన పీఠికల ద్వారా తీగకు పందిరిలా నిలుస్తారు. విమర్శకుడు కావ్య గుణదోష విచారణలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదు. ఇలాంటి విమర్శ కవి, రచయితలను రాటుదేలేలా చేస్తాయి. కా ని పీఠికకారుడు తల్లిలా రచయితకు నిలబడగలిగే ధైర్యాన్ని అందిస్తూ మరింత ముం దుకు వెళ్ళే ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వెనుకకు నెట్టకుండా వెన్నుతట్టేలా ఉండాలి. ఇదే విమర్శకునికీ పీఠికాకారునికి ఉండే వత్యాసంగా గుర్తించవచ్చు కాబట్టి కూరెళ్లవారి ప్రతి పీఠిక ఎందరో కవి, రచయితలకు, విమర్శకులకు, పరిశోధకులకు దారి చూసే “చూపుడు వేలు”గా కనిపిస్తుంది. వీరి ప్ర తి పీఠిక వర్ధిష్ణువులకు దీపస్తంభంగా పేర్కొనవచ్చు.
– దాసోజు జ్ఞానేశ్వర్

Article about Preface and science boxes in book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కూరెళ్ల పీఠికలు – విజ్ఞాన పేటికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: