పచ్చి అబద్ధాలే రాజకీయ వ్యూహమా?

  నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్, అంటే ఇండియా జిడిపిలో 10 శాతం ప్యాకేజి ప్రకటించింది. చాలా గొప్ప విషయం కదా. ఇది ఉద్దీపన ప్యాకేజి అన్నారు. కరోనా కష్టాలను గట్టెక్కిస్తామన్నారు. కాని వాస్తవానికి ఈ డబ్బులో కొన్ని రూపాయలు కూడా కొత్తగా ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం లేదు. ఉద్దీపన ప్యాకేజి నిజంగానే ప్యాకేజింగు. ఉద్దీపన అనే ప్యాకింగులో చుట్టిన ఒక మహా రుణ మేళా ఇది. మోడీ ప్రభుత్వ ఆకలితో […] The post పచ్చి అబద్ధాలే రాజకీయ వ్యూహమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్, అంటే ఇండియా జిడిపిలో 10 శాతం ప్యాకేజి ప్రకటించింది. చాలా గొప్ప విషయం కదా. ఇది ఉద్దీపన ప్యాకేజి అన్నారు. కరోనా కష్టాలను గట్టెక్కిస్తామన్నారు. కాని వాస్తవానికి ఈ డబ్బులో కొన్ని రూపాయలు కూడా కొత్తగా ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం లేదు. ఉద్దీపన ప్యాకేజి నిజంగానే ప్యాకేజింగు. ఉద్దీపన అనే ప్యాకింగులో చుట్టిన ఒక మహా రుణ మేళా ఇది. మోడీ ప్రభుత్వ ఆకలితో చస్తున్న వలస కూలీల నుంచి రైలు టిక్కెట్లు వసూలు చేస్తోంది. ఈ వార్త మీడియాలో రావడం, విమర్శలు వెల్లువెత్తడంతో మోడీ ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చింది. ప్రయాణ ఖర్చుల్లో 85 శాతం కేద్ర ప్రభుత్వం భరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం భరించాలని చెబుతోందని అన్నారు. నిజమేమిటంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆ 85 శాతం అనేది ఎప్పటి నుంచో ఇస్తూ వస్తున్న సబ్సిడీ.

కొత్తగా ఇప్పుడు వలస కూలీలకు ఇస్తున్నదేమీ కాదు. వలస కూలీల నుంచి పూర్తి టిక్కెట్టుకు సొమ్ము వసూలు చేస్తున్నారు. మామూలు రైలు టిక్కెట్టుకు అయ్యే సొమ్ము మాత్రమే కాదు, కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువ కూడా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే 85 శాతం ప్రయాణ ఖర్చు భరిస్తున్న మాటలను వలస కూలీలు నమ్మరు. ఎందుకంటే వారు ఈ కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ కష్టాలు అనుభవంలోలేని మిగిలిన వారు నమ్మవచ్చు. కాని నమ్మినా, నమ్మకపోయినా వాస్తవం మారదు. మోడీ ప్రభుత్వం చాలా బాహాటంగా అబద్ధాలు చెబుతుందన్నది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. చాలా నిస్సంకోచంగా, బాహాటంగా మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పేస్తోంది.

ఉదాహరణకు – తమ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లేదా ఎన్‌ఆర్‌సి గురించి చర్చ జరగనే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బల్లగుద్ది వాదించిన స్థాయిలో ఒక ప్రసంగంలో గట్టిగా చెప్పారు. కాని వాస్తవమేమంటే, భారత రాష్ట్రపతి, భారత హోం మంత్రి ఇద్దరు ఎన్‌ఆర్‌సి గురించి పార్లమెంటులో చెప్పారు. మోడీ మాటలు పచ్చి అబద్ధాలన్నది వెంటనే అర్థమయ్యే విషయం. అయినా మోడీ ఆ మాటలు చెప్పడానికి వెనుకాడలేదు. నల్లడబ్బును నాశనం చేయడానికే నోట్లరద్దు ప్రకటించామని నరేంద్ర మోడీ అన్నారు. కాని అలా జరగలేదు. మోడీ ప్రభుత్వం గోల్ పోస్టులు మార్చుకుంటూ, మాటలు మార్చుకుంటూ పోయింది. నోట్లరద్దు విఫలమైందన్న నిజం దాచడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారో మొత్తం దేశం విస్తుపోయి వింది.

అలాగే, ఎలక్టోరల్ బాండ్ల గురించి మోడీ ప్రభుత్వం చాలా చెప్పింది. రాజకీయ విరాళాలు దీనివల్ల చాలా పారదర్శకంగా ఉంటాయని చెప్పింది. నిజానికి దీనివల్ల రాజకీయ విరాళాలు మరింత రహస్య వ్యవహారాలయ్యాయి. మోడీ ప్రభుత్వం చెప్పిన అబద్ధాల జాబితా కొల్లేటి చాంతాడులాంటిది. అబద్ధాలన్నీ ఒక కళగా మార్చుకుని మోడీ ప్రభుత్వం. జార్జి ఆర్వెల్ ఇలా ఆపకుండా అబద్ధాలు చెప్పడాన్ని రెండు నాల్కల ధోరణిగా పేర్కొన్నాడు. అత్యంత దుర్మార్గపు నాయకత్వం నుంచి వచ్చే ప్రతి సందేశం సత్యాన్ని మార్చేస్తుంటుది. అధికారులు “యుద్ధమే శాంతి”, “స్వేచ్ఛ అంటే బానిసత్వం” వంటి మాటలు వల్లెవేస్తుంటారు. ఉదాహరణకు సత్యమంత్రిత్వశాఖ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. ప్రేమ మంత్రిత్వ శాఖ ప్రేమికులను హింసిస్తుంది” అని రాశాడు. ఆ విధంగా ప్రజలు అబద్ధాలను నిజాలుగా నమ్మే వాతావరణం సృష్టిస్తారు.

పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలను యథాతథంగా నమ్మేస్తుంటారు. మోడీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సి గురించి చెప్పింది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సి గురించి మాట్లాడలేదు. వలసకూలీల నుంచి మోడీ ప్రభుత్వం రైలు ఛార్జీలు వసూలు చేసింది. అదే సమయంలో వలస కూలీల నుంచి మోడీ ప్రభుత్వం ఒక్క పైసా వసూలు చేయలేదు. రెండు నాల్కల ధోరణి జార్జి ఆర్వెల్ చెప్పిన అనేక ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది. న్యూస్పీక్ అంటే నవ్య భాషణ, డబుల్ స్పీక్ అంటే ద్వంద్వ భాషణ, థాట్ క్రయిం అంటే ఆలోచనల నేరం వగైరా కాని, ఈ మాటలను ప్రజలెందుకు నమ్ముతున్నారు. పైగా ఏం చెప్పినా నమ్ముతున్నారు. రోజు అబద్ధాలు చెబుతున్నారని తెలిసినా వెళ్ళి బిజెపికే ఎందుకు ఓటు వేస్తున్నారు. ఈ ప్రశ్నకు చాలా జవాబులున్నాయి. బలహీనమైన ప్రతిపక్షం, మీడియా సాగిలబడి అధికారానికి సేవలు చేయడం, సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం, మోడీ పట్ల వ్యక్తిపూజ వగైరా కారణాల వల్ల ప్రజలు బిజెపి ఏం చెప్పినా నమ్మేస్తున్నారని విశ్లేషించవచ్చు.

కాని ఇంత పచ్చిగా, ఇంత బాహాటంగా అబద్ధాలు ఎవరైనా ఎలా అబద్ధాలు చెప్పగలరు? ఎవరైనా అబద్ధం చెప్పినట్లు రుజువైతే వారి విశ్వసనీయత దెబ్బతింటుంది కదా? ఇక్కడ జరుగుతున్నదేమిటంటే, అధికారాన్ని నిర్లజ్జగా దుర్వినియోగం చేయడం. మన రాజకీయాలు ఎలా మారాయంటే, ఎవరు అబద్ధం చెబుతారు? అబద్ధాలు చెప్పినా నష్టం లేకుండా కాలర్ ఎగరేయగలిగింది ఎవరు? అబద్ధ్దం చెప్పి సారీ చెప్పేది ఎవరు? అనే పోటీగా మారాయి. కాబట్టి మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నప్పుడు అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, మోడీ ప్రభుత్వం చెప్పదలచుకున్న అసలు విషయం “మేం అబద్ధాలు చెప్పగలం, మీ ప్రశ్నలను హేళన చేయడానికి అబద్ధాలు చెప్పగలం, మీరేం చేసుకుంటారో చేసుకోండి పోండి“ అని చెబుతోంది. 2016లో రాండ్ కార్పొరేషను కోసం క్రిస్టోఫర్‌ల్, మిరియ మాథ్యూస్ ఒక పత్రం రాశారు. ర్యాండ్ కార్పొరేషన్ ఒక అమెరికా థింక్ ట్యాంక్.

రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం అమలు చేసిన ప్రచార వ్యూహాల గురించి రాశారు. ఈ టెక్నిక్‌ను అబద్ధాల ప్రవాహంగా అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ వ్యూహం ఏమిటంటే, మిమ్మల్ని నమ్మించడానికి మాత్రమే అబద్ధం చెప్పడం జరగదు. ఎంత బాహాటంగా పచ్చి అబద్ధాలు విపరీతంగా చెబుతారంటే వాటిని ఒక మూర్ఖుడు మాత్రమే వాటిని నమ్మగలడు. ఈ అబద్ధాల ప్రవాహం వెనుక ఉద్దేశం అందరినీ అయోమయానికి, గందరగోళానికి గురిచేయడం దాంతో పాటు వినోదం పంచిపెట్టడం. పుతిన్ ప్రాపగాండా మోడల్‌కు సంబంధించి ఈ పత్రంలో నాలుగు లక్షణాలు గుర్తించారు. ఇవన్నీ మోడీ ప్రచార వ్యూహాల్లోనూ మనకు కనిపిస్తాయి. డోనాల్డ్ ట్రంప్ ప్రచార వ్యూహంలోను కనిపిస్తాయి.

మోడీ ప్రచార యంత్రాంగం ఒక సందేశాన్ని అనేక మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం ఎలా ఉంటుందంటే, ఒక కరడుగట్టిన హిందూత్వ ట్విటర్ హ్యాండిల్ చెప్పిన సందేశాన్నే, ఒక ముస్లిం ట్విటర్ హ్యాండిల్ కూడా చెబుతుంది. అఫ్ కోర్స్ ఇందులో కొన్ని ఫేక్ ఐడిలు ఉండవచ్చు. కొన్ని నిజమైన ఐడిలు కూడా ఉంటాయి కాని, అక్షయ్ కుమార్ చెప్పిన మాటనే తబస్సుం బేగం కూడా చెబితే, వాట్సప్ యూనివర్శిటీ ప్రచారాలు చేసే అంకుల్ చెప్పిన మాటలే రూబికా లియాకత్ కూడా చెప్పడం విన్నప్పుడు, అది ఎంత అసంబద్ధమైన విషయంగా కనిపిస్తున్నప్పటికీ నిజమేనేమో అనే అభిప్రాయం కలిగిస్తుంది. కాబట్టి పౌరసత్వ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం తీసుకోవడం జరగదు, ఇవ్వడమే జరుగుతుంది అంటే అది నిజమే కదా అని నమ్మడం ప్రారంభమవుతుంది.

హ్యాష్ ట్యాగులు, మీమ్లు, రెచ్చగొట్టే విడియోలు ఇవన్నీ ఒక ప్రకటన కన్నా ముందే సిద్ధమైపోతాయి. ప్రకటన జరిగిన వెంటనే ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియాల్లో ఇవి ప్రవాహంలా వచ్చి పడతాయి. ఈ ప్రచారం ఎంత ఉధృతంగా చేస్తారంటే ఆలోచించే అవకాశం మనకు లభించదు. ప్రభుత్వం వలసకూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయడం లేదనే మాట స్పష్టంగా చెప్పకుండా దాటవేస్తుంటుంది. మరోవైపు ప్రభుత్వం కోసం ప్రచారం చేసే ప్రాక్సీలు ప్రభుత్వం అస్సలు పైసా వసూలు చేయడం లేదని ఉధృత ప్రచారం చేస్తాయి. చివరకు ప్రజలు కూడా నమ్మడం ప్రారంభమవుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. అబద్ధాల ప్రచారం ఏ స్థాయిలో ఉధృతంగా సాగుతుందో అదే స్థాయిలో ఉధృతంగా పోటీ పడాలి. అలాగే అబద్ధాల ప్రాపగాండాను అడ్డుకోడానికి ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఫేక్‌న్యూస్, విద్వేష వార్తలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవారవుతారు.

                                                                                                      – శివం విజ్ (ది ప్రింట్)

Modi announces 10% package to revive economy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పచ్చి అబద్ధాలే రాజకీయ వ్యూహమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: