వాట్సాప్ మల్టిపుల్ డివైజెస్ ఫీచర్

ముంబై: వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఎప్పు డూ కొత్త ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా మల్టిపుల్ డివైజెస్‌పై కనిపించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ప్రస్తుత డివైజ్ నుంచి లాగౌట్ కాకుండానే వివిధ డివైజెస్ అంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్‌ను వినియోగించుకునే అవకాశాన్ని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా అందిస్తోంది. వాట్సాప్ ద్వారా లోన్లు ఇప్పటికే పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న వాట్సాప్ త్వరలోనే దేశ ప్రజలకు మరో కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ […] The post వాట్సాప్ మల్టిపుల్ డివైజెస్ ఫీచర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఎప్పు డూ కొత్త ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా మల్టిపుల్ డివైజెస్‌పై కనిపించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ప్రస్తుత డివైజ్ నుంచి లాగౌట్ కాకుండానే వివిధ డివైజెస్ అంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్‌ను వినియోగించుకునే అవకాశాన్ని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా అందిస్తోంది.

వాట్సాప్ ద్వారా లోన్లు

ఇప్పటికే పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న వాట్సాప్ త్వరలోనే దేశ ప్రజలకు మరో కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రజలందరికీ లోన్లు ఇవ్వడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మాతృసంస్థ ఫేస్‌బుక్ తన ఫైనాన్సియల్ సర్వీసులను మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా వాట్సాప్ ద్వారా క్రెడిట్ సర్వీస్‌ను భారత్‌లో లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి గాను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా నుంచి అనుమతులను వాట్సాప్ పొందింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పేమెంట్స్ ఆప్షన్‌లో చూడవచ్చు. కాగా ఈ ఫీచర్ అచ్చం పేటీఎం, మోబిక్విక్, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగానే ఉంటుందని సమాచారం.

Single Whatsapp Account on Multiple Devices

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాట్సాప్ మల్టిపుల్ డివైజెస్ ఫీచర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.