రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, ప్రతి పైసా కూడా చెల్లిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉన్నాయని ఇందులో 50 శాతం కొనుగోళ్లకు సరిపోను 10 కోట్ల బ్యాగ్‌లు ఉన్నాయన్నారు. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంను గన్నీ బ్యాగులు పంపించాలని కోరామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 60 శాతం కొత్తవి,40 శాతం పాతవి వాడుకోవచ్చునని […] The post రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, ప్రతి పైసా కూడా చెల్లిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉన్నాయని ఇందులో 50 శాతం కొనుగోళ్లకు సరిపోను 10 కోట్ల బ్యాగ్‌లు ఉన్నాయన్నారు. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంను గన్నీ బ్యాగులు పంపించాలని కోరామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 60 శాతం కొత్తవి,40 శాతం పాతవి వాడుకోవచ్చునని చెప్పిందన్నారు. రాష్ట్రంలో పాత గన్నీ బ్యాగ్‌లు ఉన్నాయన్నారు. ఇవన్నీ నెల రోజుల కొనుగోళ్లకు సరిపోతాయని తెలిపారు. టార్పాలిన్ కవర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. హమాలీల సమస్యను కూడా త్వరలో పరిష్కారించనున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వరిధాన్యం సేకరించేలా 7000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పల్లా తెలిపారు. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లకు రూ.32 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటి ఇచ్చారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యం సేకరణలో వచ్చే సమస్యలపై సత్వర పరిష్కారం కోసం 5 శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దీనికి రోజుకు వంద మంది రైతులు ఫోన్ చేస్తున్నారని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 39 లక్షల ఎకరాలలో కోటి టన్నలు ధాన్యం వస్తోందని, సిఎం ఆదేశాలకు అనుగుణంగా రైతులకు పంట కోత హార్వెస్టర్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 1500 హార్వెస్టార్‌లు కావాలంటే, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి తెలంగాణలోని 32 జిల్లాలకు పంపించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనూ 14 వేల పైచిలుకు పంటకోత యంత్రాలు ఉన్నాయన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ధాన్యం సేకరణ సమస్యలపై కంట్రోల్ కాల్ సెంటర్ నెంబర్ 7288894807,7288876545లకు రైతులు సంప్రదించాలని సూచించారు.

Farmers should not worry: Palla Rajeshwar Reddy

The post రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: