అరవింద్ నీకిది తగునా?

తప్పుడు పత్రాలంటూ టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి ట్విట్ పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆరోపణలు   మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ జనార్ధన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ అనే డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ధర్మపురి సంజయ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ 2018లో పూర్తిచేసినట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించారు. కాగా ఎంపి అర్వింద్ సమర్పించిన విద్యార్హతలు తప్పుడు పత్రాల లంటూ టిఆర్‌ఎస్ సోషల్‌మీడియా కో ఆర్డినేటర్, […] The post అరవింద్ నీకిది తగునా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తప్పుడు పత్రాలంటూ టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి ట్విట్
పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆరోపణలు

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ జనార్ధన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ అనే డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ధర్మపురి సంజయ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ 2018లో పూర్తిచేసినట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించారు. కాగా ఎంపి అర్వింద్ సమర్పించిన విద్యార్హతలు తప్పుడు పత్రాల లంటూ టిఆర్‌ఎస్ సోషల్‌మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి బుధవారం నాడు ట్వీట్ చేశారు. ఇలాంటివి సహించకూడదని, ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆయన ఆరోపించారు. ఎంపి అర్వింద్‌పై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎన్నికల నామినేషన్ సమయంలో ఆయన చదువులకు సంబంధించిన వివరాలను అర్వింద్ తప్పుడు పత్రాలను సమర్పించారని, దీనిపై ఇసి చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.సతీష్‌రెడ్డి ట్విట్ చేశారు. ఈక్రమలో అర్వింద్ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఉన్నత విద్యతకు సంబంధించిన ఫోటోలను ఆయన విడుదల చేశాడు.

ఎన్నికల అఫిడవిట్‌లో జనార్ధన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ అనే డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ధర్మపురి సంజయ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ 2018లో పూర్తిచేసినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ శ్రేణులు అర్వింద్ సమర్పించిన ఎంఎ పొలిటికల్ సైన్స్ పత్రాలను ధృవీకరించుకునేందుకు ఆ యూనివర్శిటీకి లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులెవరైనా, నామినేషన్ పత్రాలతోపాటు దాఖలు చేసే అఫిడవిట్లలో తమ వ్యక్తిగత వివరాలు, ఆస్తులు, తమపై ఉన్న కేసుల వివరాలను, విద్యార్హతల్ని సరిగ్గా వివరించాన్నది ఎన్నికల నిబంధనని, అభ్యర్థులు సమర్పించిన పత్రాలలో ఏదైనా తప్పులుంటే అది ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

TRS party Leaders complaint on MP Arvind education

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరవింద్ నీకిది తగునా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: