కరోనా కారు

  హైదరాబాద్: కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును ఓ వ్యక్తి తయారు చేశాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కారు తయారు చేశానని కనబోయిన సుధాకర్ తెలిపారు. సుధాకర్‌కు సుధా కార్స్ మ్యూజియం ఉంది. దీంతో పది రోజులు కష్టపడి కరోనా కారును తయారు చేశాడు. తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఈ కారును ప్రజల్లోకి తీసుకెళ్లి కరోనా గురించి సందేశం ఇస్తామని తెలిపాడు. ఈ కారుకు 100సిసి ఇంజన్, ఆరు చక్రాలు, సింగల్ సీటు అమర్చామని […] The post కరోనా కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును ఓ వ్యక్తి తయారు చేశాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కారు తయారు చేశానని కనబోయిన సుధాకర్ తెలిపారు. సుధాకర్‌కు సుధా కార్స్ మ్యూజియం ఉంది. దీంతో పది రోజులు కష్టపడి కరోనా కారును తయారు చేశాడు. తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఈ కారును ప్రజల్లోకి తీసుకెళ్లి కరోనా గురించి సందేశం ఇస్తామని తెలిపాడు. ఈ కారుకు 100సిసి ఇంజన్, ఆరు చక్రాలు, సింగల్ సీటు అమర్చామని సుధాకర్ తెలిపాడు. ఈ కారు 40 కిలో మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోందని తెలియజేశాడు. ప్రపంచంలో వివిధ రూపాల్లో ఉన్న కార్లను చూశాము. హెల్మెట్, కండోమ్, హ్యాండ్‌బ్యాగ్, షూ, టాయిలెట్, బర్గర్, కెమెరా, డబుల్ డెక్కర్ రూపంలో ఉన్న కార్లు రోడ్లపై పరుగులు తీశాయి. సమాజానికి ఎదో చేయాలనే తపనతో ఈ కారును తయారు చేశానని సుధాకర్ తెలిపాడు. కరోనాతో కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు ఆపాయం ఉండదని, ప్రజలలో కరోనా గురించి మంచి సందేశాన్ని ఇవ్వడానికే ఈ కారు తయారు చేశానని సుధాకర్ చెప్పుకొచ్చాడు. కరోనా రూపంలో ఉన్న హెల్మెట్లతో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. భారత్ దేశంలో కరోనా రోగుల సంఖ్య 5402కు చేరుకోగా 167 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ 404 మందికి సోకగా 11 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,36,841 చేరుకోగా 82,421 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో కరోనా రోగుల సంఖ్య నాలుగు లక్షలకు చేరుకుంది.

 

Corona car make on awareness in Telangana

The post కరోనా కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: