ఏప్రిల్ 8తో నాకు చాలా అనుబంధం ఉంది: మెగాస్టార్

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన శైలీలో ఏదో ఒక పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిరు అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 8తో త‌న‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.”ఈ రోజు హనుమజ్జయంతి. చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది.1962లో నాకు ఓ లాటరిలో ఆంజనేయస్వామి బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. ఉందని […] The post ఏప్రిల్ 8తో నాకు చాలా అనుబంధం ఉంది: మెగాస్టార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన శైలీలో ఏదో ఒక పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిరు అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 8తో త‌న‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.”ఈ రోజు హనుమజ్జయంతి. చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది.1962లో నాకు ఓ లాటరిలో ఆంజనేయస్వామి బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. ఉందని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?… ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు ‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి’ అన్నారు. అప్పటి నా ఫోటో ఇదే” అని త‌న చిన్న‌ప్ప‌టి ఫోటో మెగాస్టార్ షేర్ చేశారు.

అలాగే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, పవర్ స్టార్ తనయుడు అఖిరా నందన్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. బన్నీలోని కసి, కృషి అంటే చాలా ఇష్టంమని.. ‘హ్యాపి బర్త్ డే బన్నీ.. నువ్వు బాగుండాలబ్బా..’ అంటూ చిరు ట్వీట్ చేశాడు.

తర్వాత అఖిల్‌కు కూడా బర్త్ డే విషెస్ చెబుతూ.. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మోస్ట్ లవ్‌డ్ కిడ్ అఖిల్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిల్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.

ఇక, పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన చిరు.. ‘మన బిడ్డ మనకంటే ఎత్తకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ.. ఎత్తులో అందరికంటే ఎక్కువగా ఎదిగిపోయాడు. (6.4) అన్ని విషయాల్లో అందరినీ ఇలాగే మించిపోవాలి. విష్ యు ఎ ”పవర్”ఫుల్ వ్యూచర్. హ్యాపి బర్త్ డే అకీరా!’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

Chiranjeevi’s birthday wishes to Bunny and Akhil & Akira

The post ఏప్రిల్ 8తో నాకు చాలా అనుబంధం ఉంది: మెగాస్టార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: