ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాం: మంత్రి హరీష్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కట్టుదిట్టమైన చర్యలతో దేశంలో కరోనా మహమ్మారి అదుపులో ఉందన్నారు. అమెరికా, ఇటలీ వంటి దేశాలే కరోనాతో విలవిలలాడుతున్నాయని మంత్రి తెలిపారు. 6కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపుచేయ లేకపోతుంది. 130 కోట్ల జనాభా గల మన దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై […] The post ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాం: మంత్రి హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కట్టుదిట్టమైన చర్యలతో దేశంలో కరోనా మహమ్మారి అదుపులో ఉందన్నారు. అమెరికా, ఇటలీ వంటి దేశాలే కరోనాతో విలవిలలాడుతున్నాయని మంత్రి తెలిపారు. 6కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపుచేయ లేకపోతుంది. 130 కోట్ల జనాభా గల మన దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతూనే రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. లాక్ డౌన్ మరో పదిహేను రోజులు పెంచిన ప్రజలు సహకరించాలని  మంత్రి కోరారు.

Minister harish rao comments on coronavirus in india

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాం: మంత్రి హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: