‘మీకోసం యాప్’ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటి వద్దకే సరుకుల పంపిణీకి “మీకోసం యాప్”ను మంత్రి బుధవారం ప్రారంభించారు. నిత్యావసర సరుకుల సరఫరా కోసం మున్సిపల్ అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల కోసం […] The post ‘మీకోసం యాప్’ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటి వద్దకే సరుకుల పంపిణీకి “మీకోసం యాప్”ను మంత్రి బుధవారం ప్రారంభించారు. నిత్యావసర సరుకుల సరఫరా కోసం మున్సిపల్ అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జగదీష్ రెడ్డి తెలిపారు.

ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే సరుకుల పంపిణీ చేస్తామన్నారు. అయితే తెలంగాణలో కరోనా వైరస్ (కోవిడ్ -19)కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం ప్రజలకు కావలసిన నిత్యావసరాల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. సూర్యాపేట జిల్లాలో లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు మంత్రి జగదీష్ నిత్యావసర సరుకులు అందజేశారు.

Minister Jagadish Reddy launched meekosam App

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘మీకోసం యాప్’ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: