కరోనాపై పోరాటం.. ట్విట్టర్ సిఇఒ భారీ విరాళం

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కరోనా వైరస్ (కోవిడ్-19)పై పోరాడడానికి తమకు తోచినంత విరాళంగా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ డోర్సే బిలియ‌న్ డాల‌ర్ల విరాళం ప్ర‌క‌టించారు. ఇది తన సంపదనలోని 28 శాతం అని తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తాను ప్రకటించిన నిధుల‌ను ఎవ‌రికి ఇస్తార‌న్న విష‌యంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. స్క్వేర్ సంస్థ‌లో ఉన్న‌ త‌న షేర్ల‌ను […] The post కరోనాపై పోరాటం.. ట్విట్టర్ సిఇఒ భారీ విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కరోనా వైరస్ (కోవిడ్-19)పై పోరాడడానికి తమకు తోచినంత విరాళంగా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ డోర్సే బిలియ‌న్ డాల‌ర్ల విరాళం ప్ర‌క‌టించారు. ఇది తన సంపదనలోని 28 శాతం అని తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తాను ప్రకటించిన నిధుల‌ను ఎవ‌రికి ఇస్తార‌న్న విష‌యంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. స్క్వేర్ సంస్థ‌లో ఉన్న‌ త‌న షేర్ల‌ను విరాళం రూపంలో వినియోగించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. సార్ట్ స్మాల్ ఫౌండేష‌న్ ద్వారా  ఈ నిధులను ఖ‌ర్చు చేయనున్నారు. ట్విట్ట‌ర్‌తో పాటు స్క్వేర్ సంస్థ‌కు కూడా డార్సీ సిఇవొగా ఉన్నారు. విరాళం కోసం వాడే షేర్ల‌ు స్క్వేర్ సంస్థ‌వేనన్నారు. బాలిక‌ల చ‌దువు, ఆరోగ్యం, ప‌రిశోధ‌న గురించి వాటిని వినియోగించ‌నున్న‌ట్టు జాక్ డార్సే వెల్లడించారు.

 

Twitter CEO Jack donate $1 billion to fight coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై పోరాటం.. ట్విట్టర్ సిఇఒ భారీ విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: