కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో కోవిడ్ -19 కేసుల వృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని, కరోనా ప్రబలడం ప్రారంభమైన తర్వాత నియంత్రణలో మన దేశం, మన రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని, ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని, భారత్ పాటించిన పద్దతులను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటోందన్నారు. అమెరికా లాంటి దేశాలేే కరోనాను కట్టడి చేయలేక శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు. అమెరికా, […] The post కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో కోవిడ్ -19 కేసుల వృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని, కరోనా ప్రబలడం ప్రారంభమైన తర్వాత నియంత్రణలో మన దేశం, మన రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని, ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని, భారత్ పాటించిన పద్దతులను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటోందన్నారు. అమెరికా లాంటి దేశాలేే కరోనాను కట్టడి చేయలేక శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు. అమెరికా, యూరప్ లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జనతా కర్ఫ్యూ తరువాత లాక్ డౌన్ పాటిస్తున్నామని, లాక్ డౌన్ ఫలితంగా మన దేశంలో కరోనాను విజయవంతంగా కట్టడి చేస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు.

ఇండియా అద్భుతంగా వ్యాధిని కట్టడి చేస్తోందని ఇతర దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. దేశ వ్యాప్తంగా 4,314 మంది కరోనా బాధితులు ఉన్నారని, విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వ్యాధి కొంత మందికి సోకిందని, విదేశాల నుంచి వచ్చిన 25,937 మందికి క్వారంటైన్ చేశామని, అందులో 50 మందికి పాజిటివ్ వచ్చింది, 35 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఎల్లుండిలోగా అందరూ కోలుకుంటారు. అమెరికా లాంటి పరిస్థితి మనకు వస్తే కోట్ల మంది చనిపోయేవారన్నారు. ఈ నెల 9వ తేదీ లోపు ఒక బ్యాచ్ డిశ్చార్జ్ అవుతుందని, మొత్తం మన దగ్గర 364 మందికి కరోనా సోకింది. మొత్తం 45 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 11 మంది చనిపోయాని సిఎం కెసిఆర్ తెలపారు. 308 మంది గాంధీలో చికిత్స పొందుతున్నారు. నిజాముద్దీన్ ఈవెంట్ తరువాత 1029 మందిని గుర్తించామని, మరో 30-35 మంది ఢిల్లీలోనే ఉండిపోయినట్టు అనుమానం ఉందన్నారు. మర్కజ్ బాపతు 1089 అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ రాగా.. వీరి ద్వారా మరో 93 మందికి కరోనా సోకిందన్నారు.

CM KCR Press Meet On Covid-19 Cases Growth

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: