వీడని నిర్లక్ష్యం…కరోనా కన్నెర్ర

  హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై తిరుగుతూ వ్యాధి వ్యాప్తి చెందేలా పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నిత్యావసర సరుకుల పేరుతో బయటకు వచ్చి గంటల తరబడి వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో చాలామంది ప్రజలు భయాందోళనకు గురైతూ లాక్‌డౌన్‌ను పాటిస్తే కరోనా వైరస్ జాడలేకుండా తరిమికొట్టవచ్చని పేర్కొంటున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఊహించలేని విధంగా కేసులు నమోదుకావడంతో భవిష్యత్తులో ఈ […] The post వీడని నిర్లక్ష్యం… కరోనా కన్నెర్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై తిరుగుతూ వ్యాధి వ్యాప్తి చెందేలా పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నిత్యావసర సరుకుల పేరుతో బయటకు వచ్చి గంటల తరబడి వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో చాలామంది ప్రజలు భయాందోళనకు గురైతూ లాక్‌డౌన్‌ను పాటిస్తే కరోనా వైరస్ జాడలేకుండా తరిమికొట్టవచ్చని పేర్కొంటున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఊహించలేని విధంగా కేసులు నమోదుకావడంతో భవిష్యత్తులో ఈ పరిమాణాలు ఎక్కడికి దారి తీస్తాయని రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనలు అధికం ప్రభావం చూపాయి.

అక్కడకు వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి పాజిటివ్ రావడం, వాళ్ల నుంచి మరికొంతమందికి సోకడంతో కేసుల అనుహ్యంగా పెరిగాయి. ఆదివారం ఒక రోజు 62 కేసులు నమోదు కాగా.. అందులో గ్రేటర్ నగరానికి చెందినవి 52 ఉన్నట్లు మహ్మమారి కేసుల సంఖ్య 145కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో పాజిటివ్ కేసులు యూసుఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, మహేంద్రహిల్స్, నాంపల్లి, న్యూమలక్‌పేట, నారాయణగూడ, కుత్బుల్లాపూర్, టోలీచౌకీ, చార్మినార్, ఫిలింనగర్‌బస్తీ, బేగంపేట, కొత్తపేట, పిఅండ్‌టీ కాలనీ, అంబర్‌పేట ప్రాంతాలను హాట్ స్పాట్లుగా వైద్య ఆరోగ్య గుర్తించింది. ఈప్రాంతాల్లో ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ కరోనా వ్యాధిపై అవగాహన చేపడుతూ అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

అయిన కొంతమంది దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఇతరుల సోకేలా చేస్తూ కరోనా కట్టడికి సహాకరించడంలేదని స్దానిక వైద్యావిభాగం అధికారులు వెల్లడిస్తున్నారు. తాము బస్తీల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇదో ఒక చోట పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని చెబుతున్నారు. చుట్టు పక్కల నివశించే వారు ఫిర్యాదు చేసే వరకు కరోనా వ్యాధి చికిత్సకు రావడంలేదని మండిపడుతున్నారు.స్వచ్చందంగా వచ్చేవారి సంఖ్య చాలాతక్కువగా ఉందంటున్నారు. ఈనెల 4వ తేదీన 50 కేసులుండగా, 5వ తేదీన 93, ఈనెల 6న 145 కేసుల నమోదైనట్లు ఆరోగ్య పేర్కొంది. నగర ప్రజలంతా సహకరిస్తే కరోనా విజృంబించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.ఈనెల 14వరకు లాక్‌డౌన్ పాటించాలని కోరుతున్నారు.

145 suspected cases reported in Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వీడని నిర్లక్ష్యం… కరోనా కన్నెర్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: