ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుటుంబం 10 లక్షల విరాళం

  ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ “కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా… ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు […] The post ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుటుంబం 10 లక్షల విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ “కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా… ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు.

మా కుటుంబం నుండి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్‌మనీ నుండి తలా రెండు లక్షల చొప్పున ప్రధానమంత్రి సహాయనిధికి ఇస్తామని ముందుకు వచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని సోమవారం ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. ఇక మా కుటుంబం మొత్తం కరోనాపై పోరాటంలో పాల్గొంటున్ననందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది”అని అన్నారు.

Krishnam Raju family donates Rs 10 lakh to PMcares

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుటుంబం 10 లక్షల విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: