పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, అన్నపూర్ణ భోజనం కేంద్రం తనికీ : కెటిఆర్

  హైదరాబాద్: నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారాక రామారావు అధికారులను అదేశించారు. ఇందుకు లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు సోమవారం పరిశీలించారు. పంజాగుట్ట స్మశాన వాటిక పక్కన నుంచి ఫర్నిచర్ […] The post పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, అన్నపూర్ణ భోజనం కేంద్రం తనికీ : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారాక రామారావు అధికారులను అదేశించారు. ఇందుకు లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు సోమవారం పరిశీలించారు. పంజాగుట్ట స్మశాన వాటిక పక్కన నుంచి ఫర్నిచర్ వరల్డ్ ముందుగా చట్నీస్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రెండు లైన్ల ర్యాంపులతో పాటు స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి మంత్రి కెటిఆర్ అమీర్‌పేట్‌లోని అన్నపూర్ణ కేంద్రం వద్ద ఉచిత భోజనపంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ భోజనం చేస్తున్న పలువురితో మాట్లాడిన కెటిఆర్ భోజనం నాణ్యతపై ఆరా తీశారు. అందజేస్తున్న భోజనం సరిపోతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో భోజన పంపిణీపై లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

 

24 గంటల కొనసాగుతున్న పనులు: మేయర్ బొంతు రామ్మోహన్
లాక్‌డౌన్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌డిపి పనులు 24 గంటలు కొనసాగుతున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. లాక్‌డౌన్‌తో కలిగిన వెసులుబాటును ఉపయోగించుకుని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పురపాలక మంత్రి కె.తారాక రామారావుల ఆదేశాలతో ఎస్‌ఆర్‌డిపి, సిఎంఆర్‌పి పనులు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఇందుకు అదనపు సిబ్బందితో పాటు యంత్రాలను వినియోగిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఎప్పుడు అత్యంత రద్దీగా ఉంటే పంజాగుట్ట బంజారాహిల్స్ మార్గంలో స్మశాన వాటిక వద్ద స్థలభావంతో రోడ్డు ఇరుక్కుగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్మశానవాటిక పైపు ఉన్న సమాధలుకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా మధ్యలో నుంచి 43 మీటర్ల పోడవున స్టీల్ బ్రిడ్జిను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే స్మశాన వాటిక ప్రవేశ మార్గం వైపు ట్రాఫిక్ నియంత్రణకు ధోబీఘాట్ వైపు బయటి మార్గం నిర్మాణానికి ఆస్తులను సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Minister KTR Inspects Punjagutta Steel Bridge Works

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, అన్నపూర్ణ భోజనం కేంద్రం తనికీ : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: