సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు వెయ్యి కాల్స్

  హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూముకు సోమవారం వెయ్యి కాల్స్ వచ్చాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. వివిధ రకాల సమాచారం కోసం ప్రజలు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి సాయం చేసేందుకు 13 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కోసం ముగ్గురు ఫోన్ చేయగా వారికి సాయం చేశారు. […] The post సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు వెయ్యి కాల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూముకు సోమవారం వెయ్యి కాల్స్ వచ్చాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. వివిధ రకాల సమాచారం కోసం ప్రజలు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి సాయం చేసేందుకు 13 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కోసం ముగ్గురు ఫోన్ చేయగా వారికి సాయం చేశారు. వారు కావాల్సిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 29 భోజన కేంద్రాల్లో 22,875మందికి పంపిణీ చేశారు.

అత్తాపూర్, నానక్‌రాంగూడ, కొండాపూర్ స్లమ్, నార్సింగి, గోపనపల్లి తండా, కోకపేట,కొత్తగూడ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పేదలకు భోజనం పంపిణీ చేశారు. లాక్‌డౌన్ అయిన 15 రోజుల నుంచి ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జ్, ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. పోలీసులు, వలంటీర్ల సాయంతో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అత్యవసర రోగులకు అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

1000 Calls to Cyderabad Control room about Covid 19

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు వెయ్యి కాల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: