రోడ్లపై యధేచ్చగా తిరుగుతున్న నగర ప్రజలు

  హైదరాబాద్: లాక్‌డౌన్‌ను నగర ప్రజలు పట్టించుకోవడంలేదు. పనిఉన్నా లేకున్నా రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటికి వస్తున్న వాహనదారులు తమ ప్రాంతాల్లో వస్తువులు లభిస్తున్నా కూడా దూరప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నా నగర ప్రజలు మాత్రం మారడంలేదు. […] The post రోడ్లపై యధేచ్చగా తిరుగుతున్న నగర ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: లాక్‌డౌన్‌ను నగర ప్రజలు పట్టించుకోవడంలేదు. పనిఉన్నా లేకున్నా రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటికి వస్తున్న వాహనదారులు తమ ప్రాంతాల్లో వస్తువులు లభిస్తున్నా కూడా దూరప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నా నగర ప్రజలు మాత్రం మారడంలేదు. మూడు కమిషనరేట్ల పరిధిలో వందలాది మంది బయటికి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని గడపదాటి బయటికి రావద్దని కోరుతున్నా వినడంలేదు. నగరంలోని పలుచోట్ల పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులకు వివరాలు అడుగుతున్నారు. అక్కడ సరిగా సమాదానం చెప్పని వారి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. చెక్‌పోస్టుల ఉన్న ప్రాంతాల నుంచి వాహనదారులు వెళ్లకుండా గల్లీల్లో తిరుగుతున్నారు. పోలీసులు వారిని కూడా పట్టుకుని వేలాది వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నా నగర వాసుల్లో మార్పు రావడంలేదు. రోడ్లపైకి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వాటిపై ఉన్న చలాన్లను తనిఖీ చేసి వాటిని వసూలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న కూడా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు తెలిపారు.

సామాజిక దూరం గాలికి…
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్న ఎవరూ వినడంలేదు. ముఖ్యంగా దినసరి కూలీలకు ఏర్పాటు చేసి ఉచిత భోజనాల వద్ద సామాజిక దూరాన్ని పట్టించుకోవడంలేదు. ఒకరిపై ఒకరూ పడ్డట్లుగానే వస్తున్నారు, వారిని లైన్‌లో నిల్చోబెట్టే వారు లేకపోవడంతో ఇక్కడ సామాజిక దూరం గాలికి వదిలినట్లవుతోంది. అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే ప్రాంతాల్లో కూడా ఇది విధంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా తిరిగితే కఠిన చర్యలుః అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పనిలేకున్నా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. నగరంలో చాలా మంది పనిలేకున్నా రోడ్లపై తిరుగుతున్నారని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కోరారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వాహనాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

200 bikes and 50 cars seized in Ameerpet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్లపై యధేచ్చగా తిరుగుతున్న నగర ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: