యాంకర్ ప్రదీప్ అరుదైన రికార్డు.. తొలి సినిమాతోనే 100 మిలియన్ల వ్యూస్..

    హైదరాబాద్: బుల్లితెర స్టార్ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ అనే చిత్రంతో హీరోగా వెండితెరకు ప‌రిచ‌యం కాబోతున్నాడు. కాగా, ఎంతో మంది స్టార్ హీరోలు సాధించలేని ఓ అరుదైన ఫీట్ ను ప్రదీప్ తొలి సినిమాతోనే సాధించడం గమనార్హం. తన సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ప్రముఖ సింగర్స్ సిద్ […] The post యాంకర్ ప్రదీప్ అరుదైన రికార్డు.. తొలి సినిమాతోనే 100 మిలియన్ల వ్యూస్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: బుల్లితెర స్టార్ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ అనే చిత్రంతో హీరోగా వెండితెరకు ప‌రిచ‌యం కాబోతున్నాడు. కాగా, ఎంతో మంది స్టార్ హీరోలు సాధించలేని ఓ అరుదైన ఫీట్ ను ప్రదీప్ తొలి సినిమాతోనే సాధించడం గమనార్హం. తన సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ప్రముఖ సింగర్స్ సిద్ శ్రీ‌రామ్‌, సునీత ఆలపించిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సంగీత ప్రియుల మనస్సు దోచుకొని 100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు నెలకొల్పింది. దీంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతుంది. ఓ చిన్న సినిమాలోని పాట ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువడం తెలుగు చిత్రసీమలో ఇదే తొలిసారేమో. ఈ చిత్రంలో ప్రదీప్ కు జోడీగా బిగిల్ ఫేం అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ద‌గ్గర ప‌నిచేసిన మున్నా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.

‘Neeli Neeli Akasam’ song cross 100 million views

The post యాంకర్ ప్రదీప్ అరుదైన రికార్డు.. తొలి సినిమాతోనే 100 మిలియన్ల వ్యూస్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: