రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండుసారి కరోనా వైరస్‌(కోవిడ్-19) పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్‌గా వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు.  రెండోసారి కరోనా పరీక్షకు నూతన విధానాన్ని అనుసరించామని, కేవలయం 15 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు వచ్చాయని ట్రంప్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మరో 4 వారాల పాటు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ట్రంప్ కోరారు. […] The post రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండుసారి కరోనా వైరస్‌(కోవిడ్-19) పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్‌గా వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు.  రెండోసారి కరోనా పరీక్షకు నూతన విధానాన్ని అనుసరించామని, కేవలయం 15 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు వచ్చాయని ట్రంప్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మరో 4 వారాల పాటు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ట్రంప్ కోరారు.

కాగా, ట్రంప్‌కు మొదటిసారి ఈనెల రెండోవారంలో ఇన్వాసివ్‌ పద్దతిలో జరిపిన పరీక్షలో ఫలితం నెగెటీవ్ వచ్చింది. బ్రెజిల్‌ అధ్యక్ష ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం.. బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ట్రంప్‌ పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు, అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో దాదాపు 2.5 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 5 వేలకు పైగా మంది మరణించారు.

Donald Trump tested Negative for Second Time

The post రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: