ప్రధాని నరేంద్రమోడీ వీడియో సందేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 5 తేదీన రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేయండని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను మీ నుంచి ఆదివారం రాత్రి తొమ్మిది నిమిషాల సమాయాన్ని కోరుకుంటున్నానని మోడీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఇంట్లోని లైట్లు బంద్ చేసి కేవలం కొవ్వొత్తులు, దీపం, మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించి దేశప్రజలంతా కరోనాను తిప్పికొట్టేలా సంకల్పం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో ఇంట్లో […] The post ప్రధాని నరేంద్రమోడీ వీడియో సందేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 5 తేదీన రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేయండని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను మీ నుంచి ఆదివారం రాత్రి తొమ్మిది నిమిషాల సమాయాన్ని కోరుకుంటున్నానని మోడీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఇంట్లోని లైట్లు బంద్ చేసి కేవలం కొవ్వొత్తులు, దీపం, మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించి దేశప్రజలంతా కరోనాను తిప్పికొట్టేలా సంకల్పం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఇంట్లో ఉండే ఈ పని చేయాలని కోరారు. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తిసామర్థాలు చాటారని ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మనబాటలోనే నడుస్తున్నాయన్నాయి. మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏం సాధిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారు. ప్రతిఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనని మోడీ వివరించారు. లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉన్నా ఎవరూ ఒంటరివారు కాదు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న అందరికీ ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలపారు.

PM Narendra Modi Video Message for People, PM Narendra Modi Video Message for People, On April 5 at 9 pm light Diya candle for 9 minutes to mark fight against coronavirus: Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధాని నరేంద్రమోడీ వీడియో సందేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: