బన్నీ బర్త్‌డే రోజున టైటిల్ ప్రకటన

బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇక ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులకు సుకుమార్ ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను బన్నీ పుట్టిన రోజున ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు పెట్టినట్టు ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే […] The post బన్నీ బర్త్‌డే రోజున టైటిల్ ప్రకటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇక ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులకు సుకుమార్ ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను బన్నీ పుట్టిన రోజున ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు పెట్టినట్టు ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే వాటిని చిత్ర బృందం త్రోసిపుచ్చింది. దాంతో కొత్త టైటిల్ ఏమిటో అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు. ఇక ‘రంగస్థలం’లా ఈ సినిమా టైటిల్ కూడా మాసీగా ఉండబోతోందని తెలిసింది.

Allu Arjun birthday treat ready for fans

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బన్నీ బర్త్‌డే రోజున టైటిల్ ప్రకటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: