సిఎం సహాయనిధికి నాటా రూ. 10 లక్షల సాయం

  హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. సామాన్య పౌరుడి నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగానికి చెందిన వారితో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాసులు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాటా(నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల సాయం చేసింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ […] The post సిఎం సహాయనిధికి నాటా రూ. 10 లక్షల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. సామాన్య పౌరుడి నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగానికి చెందిన వారితో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాసులు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాటా(నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల సాయం చేసింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమర్‌నాథ్ గుండా, సెక్రటరీ రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణరెడ్డితో పాటు కమిటీ సభ్యులందరూ కలిసి రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచన మేరకు ఆ మొత్తాన్ని వారు మంత్రి కెటిఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహయనిధికి పది లక్షల చెక్‌ను అందజేశారు.

 

NATA donated to CM relief fund

The post సిఎం సహాయనిధికి నాటా రూ. 10 లక్షల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: