ఒకే ఇంట్లో 21 మందికి కరోనా….

  ముంబయి: ఒకే ఇంట్లో 21 మందికి కరోనా సోకిన సంఘటన మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్చి 18వ తేదీన నలుగురు వ్యక్తులు దుబాయ్ నుంచి ముంబయికి వచ్చారు. ఇరుకైన ఇంట్లో తన కుటుంబ సభ్యులతో ఉండడంతో ఆ ఇంట్లో ఉన్న 21 మందికి కరోనా వైరస్ వచ్చింది. ఆ కుటుంబంలో మొత్తం 47 మంది ఉన్నారని అందరికీ పరీక్షలు చేయగా ఆ నలుగురితో కలిసి 25 మంది పాజిటివ్ […] The post ఒకే ఇంట్లో 21 మందికి కరోనా…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: ఒకే ఇంట్లో 21 మందికి కరోనా సోకిన సంఘటన మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్చి 18వ తేదీన నలుగురు వ్యక్తులు దుబాయ్ నుంచి ముంబయికి వచ్చారు. ఇరుకైన ఇంట్లో తన కుటుంబ సభ్యులతో ఉండడంతో ఆ ఇంట్లో ఉన్న 21 మందికి కరోనా వైరస్ వచ్చింది. ఆ కుటుంబంలో మొత్తం 47 మంది ఉన్నారని అందరికీ పరీక్షలు చేయగా ఆ నలుగురితో కలిసి 25 మంది పాజిటివ్ వచ్చిందన్నారు. ఆ ఇంట్లో వారందరికీ కరోనా వచ్చిందని తెలియగానే సంగ్లీ గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ నలుగురిని అప్పుడే క్యారెంటైన్‌లోకి పంపిస్తే ఇలాంటివి జరిగి ఉండేది కాదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా బయట దేశాల నుంచి వచ్చిన వారని అన్ని పరీక్షలు చేసిన తరువాతే విమానాశ్రయం బయటకు పంపించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచైన ప్రతీ విమానాశ్రయంలో ఆస్పత్రిని నిర్మించి అన్ని పరీక్షలు చేసిన తరువాత విమాన ప్రయాణీకులను బయటకు పంపించాలని కోరుతున్నారు.

 

Corona virus spread same family of 21 Members in MH

 

Corona virus spread same family of 21 Members in MH

The post ఒకే ఇంట్లో 21 మందికి కరోనా…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: