వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’

  ‘మన్‌కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్‌కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో స్పందించిన నార్సింగ్ పోలీసులు వారికి భోజనం ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి కూలీ జలీశ్ తదితరులు లాక్‌డౌన్ కారణంగా ఇరుక్కుపోయామని భారతప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ లైవ్ కార్యక్రమంలో వివరించారు. దీంతో స్పందించిన ఆకాశవాణి అధికారులు […] The post వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘మన్‌కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్‌కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో స్పందించిన నార్సింగ్ పోలీసులు వారికి భోజనం ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి కూలీ జలీశ్ తదితరులు లాక్‌డౌన్ కారణంగా ఇరుక్కుపోయామని భారతప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ లైవ్ కార్యక్రమంలో వివరించారు. దీంతో స్పందించిన ఆకాశవాణి అధికారులు ఆకలితో అలమటిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 15మంది కూలీలకు సహాయం చేయాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వేణుగోపాల్‌కు ఫోన్ చేశారు. దీంతో లాక్‌డౌన్ కారణంగా ఇరుక్కుపోయిన కూలీల వద్దకు చేరుకున్న కానిస్టేబుల్ వేణుగోపాల్ వెంటనే వారికి భోజన సదుపాయం కల్పించారు. ప్రస్తుతానికి 15మంది కూలీలు ఉన్నారని, ఎంతమందికైనా భోజన ఏర్పాట్లు చేస్తామని కానిస్టేబుల్ వేణుగోపాల్ కూలీలకు హామీ ఇచ్చారు.

ఈక్రమంలో ఉత్తరఖండ్ కూలీలు మోదీకి, నార్సింగ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మన్‌కిబాత్‌కు గోడును వెళ్లబోసుకుంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గంగాధర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ వేణుగోపాల్ సహకారం చేశారని కూలీ జలేశ్ తెలిపాడు. తాము నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్ దగ్గర ఉన్నామని ఫోన్ ద్వారా తెలిపిన వెంటనే ఎస్‌ఐ గంగాధర్ స్పందించారని, మూడు రోజులు అన్నం లేక అలమటిస్తున్న కూలీలకు కడుపునిండా కానిస్టేబుల్ అన్నం పెట్టాడని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ వేణగోపాల్ మాట్లాడుతూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయినట్లు తెలిస్తే వెంటనే అన్ని విధాల సహాయసహకరాలు అందిస్తామన్నారు.

అనాథలకు, చిక్కుకుపోయిన వారిని అదుకునేందుకు మూడు ఆటోలను ఏర్పాటు చేశామని, ఆపదలో ఉన్న వారికి అన్న,పానియాలు అందిస్తున్నామని తెలిపారు. పోలీసు విధులతో పాటు సామాజిక బాధ్యతలను నెరవేర్చడం పోలీసుల బాధ్యత అని కానిస్టేబుల్ వేణగోపాల్ వివరించాడు. లాక్‌డౌన్ సందర్భంగా అటు ప్రజలకు ఇటు ఆపదలో ఉన్న వారికి నిత్యం అందుబాటులో ఉంటున్నామన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్బందుల్లో ఉన్న వారు నం. 9490617189 (ఎస్‌ఐ గంగాధర్)కు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించాలని నార్సింగ్ పోలీసు అధికారులు వివరించారు. కాగా వలస కూలీల సమస్యపై సకాలంలో స్పందించిన సహాయసహకాలు అందించిన నార్సింగ్ పోలీసులకు ఆకాశవాణి ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

 

Police arrenged meals for Migrant laborers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: