క్వారంటైన్ కేంద్రాలు రెడీ

  టార్గెట్ 12 వేలు…పూర్తయినవి 11వేల 900 పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు అత్యధికంగా నిజామాబాద్‌లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాల పనులను అధికారులు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే 99 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రంలోని 33 […] The post క్వారంటైన్ కేంద్రాలు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టార్గెట్ 12 వేలు…పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్‌లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాల పనులను అధికారులు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే 99 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తొలి విడత 12 వేలు క్వారంటైన్ బెడ్స్ టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటి వరకు 11,915 బెడ్లను పూర్తి చేశారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాల్లో 2944 బెడ్స్ ఏర్పాటు చేయగా, అతి తక్కువగా సిద్దిపేట్‌లో 70 బెడ్లను ఏర్పాటు చేశారు.

విదేశాలు, ఇతర రాష్ట్రాల ట్రావెల్ హిస్టరీ కలిగిన వ్యక్తులను అనుమానిత లక్షణాలు లేకపోయినా, 14 రోజుల పాటు ఖచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ దాటి మూడో దశలోకి వచ్చినా, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించారు. రాబోయే మూడు నెలల్లో ఎంత మందికి పాజిటివ్ వచ్చినా, చికిత్స చేయడానికి ఐసొలేషన్ వార్డులు, ఐసియూలను కూడా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

33 జిల్లాల్లో క్వారంటైన్ బెడ్స్ ఇలా…
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వం క్వారంటైన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో ఇప్పటి వరకు 11,915 బెడ్లను ఏర్పాటు చేశారు. దీనిలో మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, జనగాం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, సూర్యపేట్ జిల్లాల్లో ప్రభుత్వం నిర్ణయించుకున్న బెడ్ల టార్గెట్ పూర్తి చేయగా, రాజన్న సిరిసిల్లా జిల్లా, మంచిర్యాల, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, జగిత్యాల, వరంగల్ అర్బన్, నిజామాబాద్‌లో టార్గెట్ కంటే ఎక్కువ బెడ్లను ప్రభుత్వం సమకూర్చింది. మిగతా జిల్లాల్లో దాదాపు 90 శాతం బెడ్ల ఏర్పాట్లను పూర్తి చేసింది.

రంగారెడ్డి జిల్లాలో 2వేలు క్వారంటైన్ బెడ్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్షం పెట్టుకోగా, ఇప్పటి వరకు 1345 బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 1000 బెడ్లకు 540, నల్గొండలో 500 బెడ్లకు 100, హైదరాబాద్‌లో 1000 బెడ్లకు 684, యాదాద్రిలో 500 బెడ్లకు 240, సంగారెడ్డిలో 500 బెడ్ల కు 245, వరంగర్ జిల్లా రూరల్‌లో 500 బెడ్లకు 300, ఖమ్మంలో 500 బెడ్లకు 320, కరీంనగర్‌లో 500 బెడ్లకు 370, వనపర్తి జిల్లాలో 150 బెడ్లకు 100, వికారాబాద్ జిల్లాలో 200 బెడ్లకు 167, సిద్దిపేట్ జిల్లాలో 100 బెడ్లకు 70, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 100 బెడ్లకు 84, జయశంకర్ భూపాలపల్లిలో 100 బెడ్లకు 96, మహబూబ్‌బాద్‌లో 100 బెడ్లకు 96ను ఏర్పాటు చేశారు.

ఎక్కువ బెడ్లు ఏర్పాటు చేసిన జిల్లాలు..
రాజన్న సిరిసిల్లా 100కు 120, మంచిర్యాల 150 బెడ్లకు 189, ఆదిలాబాద్ 500 బెడ్లకు 550, జోగులాంబ గద్వాల్ 100 బెడ్లకు 150, నాగర్ కర్నూల్ 100 బెడ్లకు 190, జగిత్యాల500 బెడ్లకు 500, వరంగల్ అర్బన్ 500 బెడ్లకు 615, నిజామాబాద్ 500 బెడ్లకు 2944 బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ జిల్లాల్లో టార్గెట్ పూర్తి…
మెదక్‌లో 100 బెడ్లకు 100, కామారెడ్డిలో 100 బెడ్లకు 100, పెద్దపలిల్లో 100 బెడ్లకు 100, జనగాంలో 100 బెడ్లకు 100, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 100 బెడ్లకు 100, మహబూబ్‌నగర్ 500 బెడ్లకు 500, ములుగు 100 బెడ్లకు 100, నారాయణపేట్ 100 బెడ్లకు 100, నిర్మల్ 100 బెడ్లకు 100, సూర్యపేట్ 500 బెడ్లకు 500.

 

Government established Quarantine Beds

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్వారంటైన్ కేంద్రాలు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: