ప్రపంచంలో కరోనా కేసులు 6 లక్షలకు చేరిక

  కేసుల సంఖ్య తగ్గించడానికి సుదీర్ఘపోరాటం ఇటలీ, స్పెయిన్, చైనా, ఇరాన్, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్క రోజే 1700కు పెరిగిన మరణాలు బెర్లిన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య శనివారం నాటికి 6,00,000 కు చేరింది. ఐరోపా, అమెరికా దేశాల్లో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో వేగంగా బయటపడుతుండడంతో కరోనాపై సుదీర్ఘ పోరాటానికి అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. వైరస్‌ను నెమ్మది చేయడానికి ఇంకా చేయవలసిన పని చాలా ఉందని జాన్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. […] The post ప్రపంచంలో కరోనా కేసులు 6 లక్షలకు చేరిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేసుల సంఖ్య తగ్గించడానికి సుదీర్ఘపోరాటం
ఇటలీ, స్పెయిన్, చైనా, ఇరాన్, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్క రోజే 1700కు పెరిగిన మరణాలు

బెర్లిన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య శనివారం నాటికి 6,00,000 కు చేరింది. ఐరోపా, అమెరికా దేశాల్లో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో వేగంగా బయటపడుతుండడంతో కరోనాపై సుదీర్ఘ పోరాటానికి అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. వైరస్‌ను నెమ్మది చేయడానికి ఇంకా చేయవలసిన పని చాలా ఉందని జాన్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. ప్రస్తుతం 607,000 కేసులు దాఖలు కాగా, 28000 మందికి పైగా మరణించారని 130,000 మంది కోలుకున్నారని వివరించింది. ప్రపంచ దేశాలన్నిటి లోనూ అమెరికాలో కేసుల సంఖ్య 104,000 వరకు విపరీతంగా పెరిగింది. ఇటలీ, స్పెయిన్, చైనా, ఇరాన్, ఫ్రాన్స్ ఈ అయిదు దేశాల్లో మరణాలు దాదాపు 1700 వరకు పెరిగాయి.

ఈ సందర్భంగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఈ దశలో పూర్తిగా కేసులను నివారించ లేమని, భవిష్యత్తులో రోజుకు తక్కువగా కేసులు నమోదయ్యేలా తగ్గించ గలమని అన్నారు. వైరస్ పాజిటివ్ ఉందని డాక్టర్ చెప్పడంతో ఆమె ఇంటివద్దనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఐరోపా అంతా లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి. జర్మనీలో ఏప్రిల్ 20 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని మెర్కెల్ చీఫ్ ఆఫ్‌స్టాప్ హెల్గే బ్రౌన్ చెప్పారు. స్పెయిన్‌లో శనివారం నాటికి 832కు మించి చనిపోయారు. 9000 మంది హెల్తు వర్కర్లు వైరస్ కు గురయ్యారు. కరోనా వైరస్ సోకిన మొదటి దేశాధినేత అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వీయ నిర్బంధం నుంచే తాను పనిచేస్తానని ప్రకటించారు. సరిహద్దుల్లో నిల్చిపోయిన వలస కూలీలను తరలించడానికి దేశాలు పాటుపడుతున్నాయి.

Number of coronavirus infections crosses 6 lakhs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రపంచంలో కరోనా కేసులు 6 లక్షలకు చేరిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: