క్రీడాకారుల ఔదార్యం

  మన తెలంగాణ/క్రీడా విభాగం: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజలకు తమవంతు సహాయంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా, ఫుట్‌బాల్ టెన్నిస్ క్రీడాకారులు కరోనా బాధితుల కోసం కోట్లాది రూపాయలను విరాళాల రూపంలో అందిస్తున్నారు. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా కరోనా బాధితుల సహాయం కోసం భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ మొత్తంలో.. ఇక, భారత స్టార్లకు భిన్నంగా […] The post క్రీడాకారుల ఔదార్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజలకు తమవంతు సహాయంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా, ఫుట్‌బాల్ టెన్నిస్ క్రీడాకారులు కరోనా బాధితుల కోసం కోట్లాది రూపాయలను విరాళాల రూపంలో అందిస్తున్నారు. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా కరోనా బాధితుల సహాయం కోసం భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.

భారీ మొత్తంలో..
ఇక, భారత స్టార్లకు భిన్నంగా ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, ఇతర క్రీడలకు సంబంధించిన వారు కోట్లాది రూపాయలను కరోనా బాధితుల కోసం విరాళాలుగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కరోనాతో అల్లాడుతున్న వారిని ఆదుకునేందుకు తనవంతు సహాయంగా భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించాడు. మహమ్మరిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తనవంతు సహాయంగా 8 కోట్ల 30 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇక, మరో సాకర్ స్టార్, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పోర్చుగల్‌లోని ఆసుపత్రులకు కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు.

ఈ క్రమంలో ఐసియూలలో చికిత్స తీసుకునే వారికి అయ్యే వైద్య ఖర్చులను మొత్తం తానే భరించేందుకు సిద్ధమయ్యాడు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా కరోనా బాధితుల సహాయం భారీ విరాళాన్ని ప్రకటించాడు. కరోనా నివారణ కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అండగా నిలువాలని నిర్ణయించాడు. ఇందుకుగాను ఏడు కోట్ల 86 లక్షల భారీ విరాళాన్ని అందజేశాడు. వీరే కాకుండా చాలా మంది టెన్నిస్, బాక్సింగ్, ఫుట్‌బాల్ స్టార్లు కూడా ఆయా దేశాలకు చెందిన ప్రజల సహాయార్ధం కోట్లాది రూపాయలను విరాళాల రూపంలో అందిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ పేర్లు బయటకు రాకుండానే సహాయాన్ని అందజేస్తుండడం మరో విశేషం. ఇదిలావుండగా శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా తమవంతు సహాయంగా లక్షలాది రూపాయలను విరాళాలుగా అందించారు.

భారత స్టార్లు మాత్రం
అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రీడాకారులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నా కోట్లకు పరిగెత్తిన భారత క్రికెటర్లు మాత్రం అరకొర విరాళాలతోనే సరిపెట్టుకుంటున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా వంటి స్టార్ క్రికెటర్లు ఐపిఎల్ వంటి టోర్నీలతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందారు. అయితే దేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు మాత్రం వారు ముందుకు రావడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, బ్యాడ్మింటన్‌లో వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన స్టార్ షట్లర్ పి.వి.సింధు కేవలం పది లక్షల రూపాయల విరాళంతో సరిపెట్టుకుంది. ఇక, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించనే లేదు.

Sport stars donate money amid coronavirus pandemic

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్రీడాకారుల ఔదార్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: