గాంధీలో చికిత్స భేష్

  వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స అద్భుతంగా ఉందని ఓ బాధితుడు వీడియోలో వెల్లడించారు. తనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే 104ని సంప్రదించానని, ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ తేలడంతో ఆశ్చర్యానికి గురయ్యానని ఆ […] The post గాంధీలో చికిత్స భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు
ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు
ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు
వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు
వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స అద్భుతంగా ఉందని ఓ బాధితుడు వీడియోలో వెల్లడించారు. తనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే 104ని సంప్రదించానని, ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ తేలడంతో ఆశ్చర్యానికి గురయ్యానని ఆ వ్యక్తి తెలిపారు. అయితే గాంధీలో చేరినప్పటి నుంచి ఇక్కడ వైద్యు లు రోగులకు చాలా జాగ్రత్తగా చికిత్స నిర్వహిస్తున్నారన్నారు.

ప్రతి రోజూ 2 సార్లు వచ్చి ఆరోగ్య వివరాలు సేకరిస్తారని, అదే విధంగా మూడు సార్లు ఆహ రం, డ్రైప్రూట్స్ కూడా అందిస్తారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కానీ వైద్యులు పట్టించుకోవడం లేదని కొందరు సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యామాల్లో తప్పుడు ప్రచారం చేస్తే బాధ కలిగి ఈ వీడియోను పోస్టు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందికి చేతులు ఎత్తి దండం పెట్టవచ్చని, కరోనా పెషెంట్ ఉండే గదులు చాలా క్లీన్‌గా ఉంటాయని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు యూకెలో కూడా లేవని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ మంత్రి తనకు రెండు సార్లు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారని అన్నారు. వైరస్ పుణ్యామా అని పోలీస్, మెడికల్ సిబ్బంది మరో సారి హీరోలు అని గుర్తు చేసుకున్నానని తెలిపారు. సామాజిక దూరమే వైరస్ నివారణని, ప్రజలందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. అయితే వీడియో ఎవరు పోస్టు చేశారనేది ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ అధికారులు వివరాలు వెల్లడించలేదు.

 

Corona treatment at Gandhi Hospital is amazing

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాంధీలో చికిత్స భేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: