మందుబాబులకు కరోనా కష్టాలు…కల్లు దొరకక విలవిల

  హైదరాబాద్: కరోనా వైరస్ మందుబాబులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గత ఐదు రోజులుగా మద్యం అందుబాటులో లేక విలవిలలాడుతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 22న జనతా కర్ఫూను నిర్వహించిన విషయం తెలిసిందే. కర్ఫూలో భాగంగా అన్ని దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేశారు. ఈక్రమంలోనే ఈనెల 23 నుంచి 31 వరకు తెలంగాణ […] The post మందుబాబులకు కరోనా కష్టాలు… కల్లు దొరకక విలవిల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కరోనా వైరస్ మందుబాబులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గత ఐదు రోజులుగా మద్యం అందుబాటులో లేక విలవిలలాడుతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 22న జనతా కర్ఫూను నిర్వహించిన విషయం తెలిసిందే. కర్ఫూలో భాగంగా అన్ని దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేశారు. ఈక్రమంలోనే ఈనెల 23 నుంచి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మరో అడుగువేసి ఏప్రిల్ 14వరకు 21రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో మందుబాబులకు కష్టాలు చుట్టుముట్టాయి.

22వ తేదీన కర్ఫూతో ముందురోజు తెచ్చిపెట్టుకునా ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడంతో విలవిలలాడుతున్నారు. మద్యం దొరక్క అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. మందుబాబుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఒక్కో బాట్‌లపై రెట్టింపు ధరలు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలిసింది. రూ.1000 లోపు ధరలు ఉన్న కొన్ని బ్రాండ్ల ఫుల్‌బాటిల్‌ను రూ.2000 నుంచి రూ.5000 బ్లాక్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిప్రాంతాల్లో మందు దొరకక నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లో ఓ యువకుడు విద్యుత్ స్థంభం ఎక్కి మద్యం కోసం హల్‌చల్ చేసిన విషయం విధితమే. అంబర్‌పేట్‌లో మరో యువకుడు మద్యం దొరకక వైట్‌నర్ సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నారు.

ఇలాంటి సంఘటనలు నగరంలోని అనేక ప్రాంతాలలో చోటుచేసుకుంటున్నాయి. సైదాబాద్ పరిధిలోని సింగరేణికాలనీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మద్యానికి బానసైన అనేకమంది ఐదురోజులుగా మధ్యంలేక స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తుండటం విశేషం. అయితే, కొందరు మద్యం వ్యాపారులు రంగంలోకి దిగి బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. రెట్టింపు ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నారు. గ్రేటర్ పరిధిలో 173 మద్యం దుకాణాలు ఉండగా, నిత్యం రూ.10 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. పండగల వేళా మరింత ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఒక్కసారిగా మద్యం దుకాణాలు మూసివేతతో మందుబాబులు చిందులు తొక్కుతున్నారు.

కల్లు దొరకక విలవిల: మద్యంతో పాటు కల్లు విక్రయాలను కూడా ప్రభుత్వం నిలిపివేయడంతో మందుబాబులు విలవిలలాడుతున్నారు. కల్లుకు బానిసలైన వారు కల్లు దొరకక రాత్రిళ్లు వింతగా ప్రవర్తిస్తున్నారని… నానా గలాభా సృష్టిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

Liquor Sales in Block Market with Coronavirus Effect

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మందుబాబులకు కరోనా కష్టాలు… కల్లు దొరకక విలవిల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.