కాశీలో తెలుగు భక్తుల ఇక్కట్లు…. ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు

  హైదరాబాద్: కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ నెల 13న భక్తుల బృందం రైలు మార్గంలో కాశీ యాత్రకు బయలు దేరింది. 29న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ట్యాబ్లెట్లు, డబ్బులు అయిపోయాయని తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ స్పందించాలని వారు కోరుతున్నారు. […] The post కాశీలో తెలుగు భక్తుల ఇక్కట్లు…. ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ నెల 13న భక్తుల బృందం రైలు మార్గంలో కాశీ యాత్రకు బయలు దేరింది. 29న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ట్యాబ్లెట్లు, డబ్బులు అయిపోయాయని తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ స్పందించాలని వారు కోరుతున్నారు. అలాగే గుంటూరు నగరంలోని నల్లచెరువు, కొరిటెపాడు, మేనకా గాంధీ నగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 55 మంది కూడా మూడు రోజులుగా కాశీలోనే తిరుగుప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఐదు రోజులు మాత్రమే బస చేసేందుకు ఆశ్రమం నిర్వాహకులు అనుమతి ఇచ్చారని తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు.

తమలో కొందరు కొన్ని జబ్బులకు మందులు వాడుతున్నవారు ఉన్నారని, ఇక్కడ మందులు దొరకక ఇబ్బందులు పడుతున్నామని గుంటూరుకు చెందిన రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 29 మంది కూడా కాశీలో బిక్కుబిక్కుమంటున్నారు. వీరు ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో వెళ్లా రు. 22న తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా రైళ్లు రద్దు కావడంతో ఓ సత్రంలో తలదాచుకున్నారు.తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన 27 మంది ఈనెల 16న కాశీ ప్రయాణానికి వెళ్లారు. -పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులు ఈనెల 9న ఉత్తరభారతదేశం యాత్రకు వెళ్లారు. వీరంతా ఈనెల 22న తిరుగుప్రయాణం కావాల్సి ఉండగా రైళ్ల రద్దుతో చిక్కుకుపోయారు. కాగా కాశీలో ఇరుక్కుపోయిన భక్తులు తమను కాపాడాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు.

Problems of Telugu devotees in Kashi due to corona

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాశీలో తెలుగు భక్తుల ఇక్కట్లు…. ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.