భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషన్ కెఐ వరప్రసాద్ రెడ్డి ప్రగతి భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా ఒక కోటి 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి […] The post భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషన్ కెఐ వరప్రసాద్ రెడ్డి ప్రగతి భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా ఒక కోటి 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి అందించారు. కెఎన్‌ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్‌ఎఫ్ కు అందించారు. లారస్ ల్యాబ్స్ సిఇఒ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరుఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సిఎంఆర్‌ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును సిఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగుకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్పూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని సిఎం అన్నారు.

KI Varaprasad reddy Donates Rs.1 crore to CM Relief Fund

The post భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: