జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా మరణం

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్ లోని చెస్ట్ డిసీజ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్టు జమ్మూకాశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్టు వైద్యులు వెల్లడించారు. మృతుడిని హైదర్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. ముంబై, థానేలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ర్ట వ్యాప్తంగా […] The post జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్ లోని చెస్ట్ డిసీజ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్టు జమ్మూకాశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్టు వైద్యులు వెల్లడించారు. మృతుడిని హైదర్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. ముంబై, థానేలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ర్ట వ్యాప్తంగా 124 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 649 చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మరి బారిన పడిమృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న నిత్యవసరాల కోసం భారీగా జనం రోడ్లపైకి వస్తున్నారు. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షలు దాడింది. 21వేలు దాటిన ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య. కరోనా ధాటికి ఇటలీ, స్పెయిన్ అల్లాడుతున్నాయి.

First coronavirus death in Jammu and Kashmir

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: