యశోద ‘ఆన్‌లైన్’ కన్సల్టేషన్

  మన తెలంగాణ/ హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్టా యశోద హాస్పిటల్ రోగుల సౌకర్యార్థం ఆన్‌లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్ సదుపాయాన్ని ప్రారంభిందని ఎండి జి ఎస్ రావు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని, అత్యవసర వైద్య సలహా కోసం తమ వైద్యులను ఆన్‌లైన్ వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించాలని ఆయన వెల్లడించారు. డయాబెటిస్, కిడ్ని, గుండె సమస్యలు మొదలైన దీర్ఘకాలిక రోగులందరికి స్థిరమైన సమీక్ష, వైద్యుల […] The post యశోద ‘ఆన్‌లైన్’ కన్సల్టేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్టా యశోద హాస్పిటల్ రోగుల సౌకర్యార్థం ఆన్‌లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్ సదుపాయాన్ని ప్రారంభిందని ఎండి జి ఎస్ రావు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని, అత్యవసర వైద్య సలహా కోసం తమ వైద్యులను ఆన్‌లైన్ వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించాలని ఆయన వెల్లడించారు. డయాబెటిస్, కిడ్ని, గుండె సమస్యలు మొదలైన దీర్ఘకాలిక రోగులందరికి స్థిరమైన సమీక్ష, వైద్యుల సలహా అవసరమని ఆయన తెలిపారు. అందరి ఆరోగ్యఅవసరాలకు సంబంధించి తమ వైద్యులు నిరంతరం మార్గనిర్దేశం చేసి, సలహాలు ఇస్తారని యశోదా ఎండి తెలిపారు. ఆన్‌లైన్ సేవల కొరకు డబ్లూ.డబ్లూ.డబ్లూ యశోదా హాస్పిటల్.కమ్, 040- 45674 567ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ప్రజలందరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Online Doctor consultation facility for Yashoda patients

The post యశోద ‘ఆన్‌లైన్’ కన్సల్టేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: