ఉగాదిని పురస్కరించుకొని తెలుగు ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కరోనా మహామ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో […] The post ఉగాదిని పురస్కరించుకొని తెలుగు ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కరోనా మహామ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో మనం, మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ప్రభుత్వం సమయానుసారం ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె సూచించారు.

 

Ugadi wishes says Governor Tamilisai Soundararajan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉగాదిని పురస్కరించుకొని తెలుగు ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: