ఊరట…ఉపశమనం

  ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్ 30 వరకు పొడిగింపు టిడిఎస్ చెల్లింపు ఆలస్యంపై వసూలు చేసే వడ్డీ 18% నుండి 9%కు తగ్గింపు 2018-19కు ఆదాయపు పన్ను దాఖలుకు గడువు జూన్ 30 వరకు పొడిగింపు ‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ జూన్ […] The post ఊరట…ఉపశమనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు
ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
టిడిఎస్ చెల్లింపు ఆలస్యంపై వసూలు చేసే వడ్డీ 18% నుండి 9%కు తగ్గింపు
2018-19కు ఆదాయపు పన్ను దాఖలుకు గడువు జూన్ 30 వరకు పొడిగింపు
‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ జూన్ 30 వరకు పొడిగింపు
రూ.5 కోట్ల లోపు టర్నోవర్ కంపెనీలకు ఆలస్యంగా జిఎస్‌టి ఫైలింగ్‌పై వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము ఉండదు. పెద్ద కంపెనీలకు తగ్గింపు రేటును చార్జ్ చేస్తారు.
డిజిటల్ వాణిజ్యం కోసం బ్యాంక్ చార్జీలు తగ్గింపు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరటనిచ్చే చర్యలు తీసుకున్నారు. సామాన్యులు, వ్యాపారవేత్తలకు ఆదాయపు పన్ను వడ్డీ, రాబడి, ఇతర నిబంధనల విషయంలో ప్రభుత్వం అనేక రకాల రాయితీలను ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం గడువు మార్చి 31 సమీపించడంతో ఆదాయం పన్ను, జిఎస్‌టితో సహా అన్ని అంశాల్లో సానుకూల నిర్ణయాలు చేపట్టారు. బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచే నిబంధనలను కూడా రద్దు చేశారు. ఐటి రిటర్న్ దాఖలు చేయడానికి, పాన్-ఆధార్‌ను అనుసంధానించే తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో సీతారామన్ ఈ ప్రకటన చేశారు. అలాగే డెబిట్ కార్డు ఖాతాదారులు మూడు నెలలపాటు ఏ ఇతర బ్యాంక్ ఎటిఎం నుంచైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపారు. బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘పౌరులపై ఎలాంటి భారం పడకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నాం’ అని సీతారామన్ అన్నారు.

త్వరలో ఆర్థిక ప్యాకేజీ
ఆర్థిక ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయని, అతి త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌కు సంబంధించిన పనుల్లో ఇప్పుడు సిఎస్‌ఆర్ నిధులు ఇవ్వవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ఈ ఫండ్ ఇప్పుడు ఉపయోగిస్తారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దీనిని విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావిత రంగాలకు త్వరలో సహాయ ప్యాకేజీని ప్రకటించవచ్చని ఆర్థిక మంత్రి సూచించారు. ఇది కాకుండా సెబీ, రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. కాగా కరోనావైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఇప్పుడు అది మాంద్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇది కాకుండా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ వంటి పరిస్థితులు పారిశ్రామిక కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

జిఎస్‌టి రిటర్న్‌లు
n రూ.5 కోట్ల లోపు టర్నోవర్ కంపెనీలకు ఆలస్యంగా జిఎస్‌టి ఫైలింగ్‌పై వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము ఉండదు. పెద్ద కంపెనీలకు తగ్గింపు రేటును చార్జ్ చేస్తారు.
n ఏప్రిల్ 15తో ముగిసే మత్స్యకారులకు శానిటరీ దిగుమతి అనుమతుల వ్యవధిని మూడు నెలల వరకు పొడిగించారు.
n 2020 మార్చి ఏప్రిల్, మే జిఎస్‌టి రిటర్న్‌లు, కంపోజిషన్ రిటర్న్‌లు జూన్ 30 వరకు పొడిగింపు
n దిగుమతిదారులు, ఎగుమతిదారులకు ఉపశమనం. కస్టమ్ క్లియరెన్స్ ఇప్పుడు జూన్ 30 వరకు అవసరమైన సేవల్లో చేర్చారు. 24 గంటలు పని చేస్తుంది.
n బోర్డు సమావేశం అవసరాలకు 60 రోజుల పాటు సడలింపు ఇచ్చారు. ఇది వచ్చే రెండు త్రైమాసికాలకు వర్తిస్తుంది.
n డిక్లరేషన్ ఫైల్ చేసేందుకు కొత్తగా స్థాపించిన కంపెనీలకు ఆరు నెలల అదనపు సమయం ఇచ్చారు.
n కంపెనీలు దివాలా తీయకుండా కొంత వేచిచూసే ధోరణి
n సబ్కా విస్వాస్ పథకం చాలా విజయవంతమైంది. ఈ పథకం కింద జూన్ 30 లోగా చెల్లింపు చేయవచ్చు.
n ట్రస్ట్ పథకాన్ని కూడా జూన్ 30కి పెంచారు.

బ్యాంకింగ్
n ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు.
n ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు
n పాన్-ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
n డిజిటల్ లావాదేవీల కోసం బ్యాంక్ చార్జీలు తగ్గింపు.
ఆదాయం పన్ను రిటర్న్‌లు
n టిడిఎస్ చెల్లింపు ఆలస్యంపై వసూలు చేసే వడ్డీని 12% నుండి 9%కు తగ్గించారు.
n 2018-19కు ఆదాయపు పన్ను దాఖలుకు గడువు జూన్ 30 వరకు పొడిగింపు
n ‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ జూన్ 30 వరకు పొడిగింపు

స్టాక్‌మార్కెట్
n ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆలోచనలు జరుగుతున్నాయి. త్వరలో ప్రకటిస్తామని వెల్లడి.
n ప్రభుత్వం, సెబీ రోజుకు మూడుసార్లు స్టాక్‌మార్కెట్ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నాయి.

 

ITR return filing date is an extension until June 30th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఊరట…ఉపశమనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: