సంపాదకీయం: కరోనా –ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించిన వైనం అత్యంత ఆనందాన్ని కలిగించింది. ఒక విపత్తు ఎదురైనప్పుడు భారత ప్రజలు ఒక జాతిగా ఒక్క త్రాటి మీదికి వచ్చి దానిని ఎలా ఎదిరిస్తారో మొక్కవోని దీక్షతో ఎలా పోరాడుతారో ఈ […] The post సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించిన వైనం అత్యంత ఆనందాన్ని కలిగించింది. ఒక విపత్తు ఎదురైనప్పుడు భారత ప్రజలు ఒక జాతిగా ఒక్క త్రాటి మీదికి వచ్చి దానిని ఎలా ఎదిరిస్తారో మొక్కవోని దీక్షతో ఎలా పోరాడుతారో ఈ సందర్భం చాటింది. సరిహద్దుల్లోని సైనికుల మాదిరిగా 130 కోట్ల మంది దేశ ప్రజలు జన సైనికులై అకుంఠితమైన సంకల్పంతో హృదయగతమైన ఉక్కు పిడికిలితో ఏ విధంగా ప్రతిఘటిస్తారో వెల్లడయింది. స్వచ్ఛంద కర్ఫూను ఒక్క రోజుతో సరిపుచ్చక ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలన్న ఆదేశాలనూ ప్రజలు అంతే పట్టుదలతో అమలు పరుస్తున్నారు. వారికి జేజేలు. కరోనా వైరస్ కేవలం లాక్‌డౌన్‌లతోనే సమసిపోదని ఇది ముందుముందు మళ్లీ తలెత్తకుండా ఉండడానికి ప్రజారోగ్య పరిరక్షణ కృషిని మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యున్నత స్థాయి నిపుణుడు మైక్ ర్యాన్ ఆదివారం నాడు చేసిన ప్రకటన గమనించదగినది. అదే సందర్భంలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, నగరంలోని పాతబస్తీలో పెద్ద ఎత్తున పారిశుద్ధ చర్యలు తీసుకుంటున్నదని వచ్చిన వార్త కూడా గమనించదగినది.

ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఆపత్కాలాలలో స్పందించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలను రంగంలోకి దింపి అంటువ్యాధులు ప్రబలకుండా చేసే మందులను వీధుల్లో చల్లుతుండడం మైక్ ర్యాన్ అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నది. నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో పారిశుద్ధానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైరస్ నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండవచ్చు. ఈ సూకా్ష్మన్ని గమనించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టి పరిశుభ్రతకు, పారిశుద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం తెలిసిందే. ఇప్పుడు కరోనా పై కత్తి కట్టి నగరాలు, పట్టణాలలో మరింతగా అంటువ్యాధుల నివారణ చర్యలు తీసుకుంటున్నారు. 191819లో విజృంభించిన స్పానిస్ ఫ్లూ ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మందిని అందులో భాగంగా భారత దేశంలోనే 2 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నది. అప్పటి బ్రిటిష్ పాలకులు దేశ ప్రజలను దాని నుంచి రక్షించడంలో విఫలమయ్యారు. గత పదేళ్లలో ఎబోలా, ఎల్లో ఫీవర్, సార్స్, మెర్స్ వంటి వైరస్‌లు ప్రబలి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలకు కారణమయ్యాయని, భారత దేశంలో మాత్రం అవి తోక ముడిచాయని భారత హృద్రోగ చికిత్సా నిపుణుల ఫౌండేషన్ అధ్యక్షుడు కెకె అగర్వాల్ అంటున్నారు. వైరస్‌లు వాటికి అనుకూలమైన శీతల వాతావరణం గల దేశాల్లోనే కరాళ నృత్యం చేస్తాయని అవి భారత దేశంలో ప్రవేశించగానే వాటి మృత్యుకోరల పదును నీరసిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మనది ఉష్ణ మండల దేశం. ఎల్లప్పుడూ 2530 డిగ్రీలకు తక్కువకాని ఉష్ణోగ్రత ఉంటుంది.

గాఢమైన వేసవిలోనూ, అంతకు ముందు 38 నుంచి 43 డిగ్రీల వరకు ఎగబాకుతుంది. ఒక్కోసారి కొన్ని చోట్ల 45 నుంచి 48, 50 డిగ్రీలను కూడా తాకుతుంది. ప్రస్తుత వేసవి కాలం కరోనా వైరస్‌కు మింగుడు పడనిది. అందుచేత ఇతర దేశాల్లో విజృంభించినట్టు మన దేశంలో అది పేట్రేగజాలదు. అలాగని నిర్లక్షం వహించడానికి వీలులేదు. కరోనా రెండవ దశలోనే ఉండగానే దేశంలో ఇప్పటికి 8 మందిని బలి తీసుకున్నది. 425 మందికి సోకింది. మన రాష్ట్రంలోనూ నెమ్మది నెమ్మదిగానైనా అది విస్తరిస్తున్నది. మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్నది. కరోనా మృతుల్లో ఒకరిద్దరు యువకులు కూడా ఉండడం గమనించవలసిన అంశం. అది కేవలం వృద్ధులకు, పసి బాలలకు మాత్రమే పరిమితమనే అభిప్రాయాన్ని వదులుకోవాలి. అందుచేత అత్యంత మెళకువ వహించి అత్యున్నత శ్రేణి ముందు జాగ్రత్తలతో కరోనాపై యుద్ధం చేయవలసి ఉంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఆత్మరక్షణ చర్యలను చూడవలసి ఉన్నది, సహకరించవలసి ఉన్నది. అత్యున్నత జీవన ప్రమాణాలున్నట్టు జబ్బలు చరచుకునే అమెరికాలోనే 35,224 కేసులు నమోదయ్యాయి. 471 మంది మరణించారు. ఇటలీలో అత్యధికంగా 5,476 మంది మృతి చెందారు. 59,138 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా జన్మస్థానమైన చైనాలో 81,454 మందికి సోకగా, 3,274 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 16,243 కేసులు బయటపడగా, 676 మంది మరణించారు. ఇరాన్‌లో 21,638 కేసులు బయటపడగా, 1,688 మంది చనిపోయారు. కరోనా దేశదేశాల్లో సృష్టించిన మృత్యు బీభత్సం దీనిని బట్టి అర్థమవుతున్నది. మన దేశంలో అటువంటి విపత్కర పరిస్థితులు దాపురించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోడం, ప్రజారోగ్యాన్ని కాపాడుకోడం అత్యంత ఆవశ్యకం.

 

Corona symptoms in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.