కరోనాపై ప్రధాని హితోక్తులు

  భారత దేశంలో ఇప్పటికే పలు ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ ప్రధాని మోడీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ, ప్రజలు తమ ఇళ్ల బాల్కనీల నుండి సాయంత్రం చప్పట్లు కొట్టడం మాత్రమే చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా కేరళ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ప్యాకేజి ప్రకటించింది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే పింఛన్లు ఏమీ పొందని వారికి ఏప్రిల్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించేందుకు రూ.1320 కోట్లను ముఖ్యమంత్రి […] The post కరోనాపై ప్రధాని హితోక్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత దేశంలో ఇప్పటికే పలు ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ ప్రధాని మోడీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ, ప్రజలు తమ ఇళ్ల బాల్కనీల నుండి సాయంత్రం చప్పట్లు కొట్టడం మాత్రమే చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా కేరళ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ప్యాకేజి ప్రకటించింది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే పింఛన్లు ఏమీ పొందని వారికి ఏప్రిల్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించేందుకు రూ.1320 కోట్లను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేటాయించారు.

ప్రపంచ ప్రజలు అందరూ ప్రాణాంతక కరోనా వైరస్‌తో భయకంపితులై ఉన్న సమయంలో, మొత్తం ఆర్ధిక వ్యవస్థ చెల్లాచెదురైన పరిస్థితులలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాత్రి ప్రసంగిస్తున్నారంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఆరోగ్యపరంగా ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితులలో ప్రజలకు చేదోడుగా ఉండే విధంగా ప్రభుత్వపరంగా ఆయన అనేక చర్యలు ప్రకటిస్తారని ఆశించారు. అయితే ఆయన ప్రసంగం అన్ని ఉపదేశాలకూ పరిమితమై పోయింది. ఎవ్వరికి వారు జాగ్రత్త వహించి, స్వయం క్రమశిక్షణ ప్రదర్శించి ఈ ఉపద్రవం నుండి బైట పడాలని సూచించారు. అందుకు ఎన్నో హిత వచనాలు పలికారు. తమను తామే కాపాడుకోవాలి అన్నట్లు సూచించారు.

ఒక పీఠాధిపతిగా చేసిన ఉపవచనాలువలే ఉన్నాయి గాని, దేశాధినేతగా ఏమి చేయబోతున్నారో మాత్రం మాట్లాడక పోవడం గమనార్హం. ప్రపంచం అంతా కంగారు పడుతున్నా చైనా పక్కనే ఉన్న చిన్న దేశం తైవాన్ ఏ విధంగా విజయవంతంగా ఎదుర్కొందో వంటి అనుభవాలను చెప్పినా బాగుండెడిది. ముఖ్యంగా అంతా బంద్ పాటిస్తూ ఉండడంతో ఆదాయ వనరులు కోల్పోతున్న పేదలు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా రోజువారీ వేతనాలపై ఆధారపడి ఉండేవారికి ప్రభుత్వ పక్షాన కొంత సహాయం అందించడం వంటి ప్రకటనలు అయినా చేయకపోవడం గమనార్హం. ఈ సవాల్‌ను తన ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతున్నదో వివరించి ఉంటె సముచితంగా ఉండెడిది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే బాధ్యతను మొత్తం ప్రజలపై నెట్టివేసి ధోరణిలో ప్రధాని ప్రసంగం ఉన్నదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలు చేసిన ప్రకటనలను ఆమె గుర్తు చేశారు.

ఫ్రాన్స్ గృహ వినియోగ బిల్లుల చెల్లింపును రద్దు చేయగా, స్పెయిన్ జాతీయ ఆరోగ్య సదుపాయం కల్పించింది. ఇటలీ, చైనా ఇంటి వద్దే పలు సేవలు అందించే ఏర్పాట్లు చేశాయి. ఆర్ధికంగా అణగారిన వర్గాలను ఆదుకోవడంతో పాటు, అందరికీ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చి ఉండవలసింది. ఈ సందర్భంగా పలు దేశాలు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలు గమనార్హం. యుకె 39 బిల్లియన్, అమెరికా 1.2 ట్రిలియన్, ఫ్రాన్స్ 45 బిలియన్, న్యూజిలాండ్ 8 బిల్లియన్, ఇటలీ 28 బిలియన్, కెనడా 56 బిలియన్, దక్షిణ కొరియా 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. భారత దేశంలో ఇప్పటికే పలు ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ ప్రధాని మోడీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ, ప్రజలు తమ ఇళ్ల బాల్కనీల నుండి సాయంత్రం చప్పట్లు కొట్టడం మాత్రమే చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా కేరళ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ప్యాకేజి ప్రకటించింది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే పింఛన్లు ఏమీ పొందని వారికి ఏప్రిల్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించేందుకు రూ.1320 కోట్లను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేటాయించారు.

పేదలకు ఉచితంగానే ఆహార పదార్థాలను అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు. ఉచిత ఆహార ధాన్యాలను అందజేసేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు. ప్రయాణ వాహనాలకు పన్ను రాయితీ కల్పించనున్నారు. ఆరు నెలలకు సరిపడిన రేషన్‌లను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. అయితే రోజువారీ ఆదాయాలు కోల్పోయిన ప్రజలు ఆరు నెలల రేషన్‌ను ఒకేసారి కొనుగోలు చేయగలరా? ప్రధాని ప్రసంగానికి కొన్ని గంటల ముందే పలు ప్రజా సంఘాలు చెందిన నేతలు ప్రభుత్వం ఈ సందర్భంగా చేయవలసిన ఐదు అంశాలను దేశం ముందు ఉంచారు. మొదటగా అన్ని రకాల తొలగింపులపై నిషేధం విధించాలి. అద్దెలు, రుణ వాయిదాలు చెల్లించలేని పక్షంలో ఇళ్ల నుండి, స్థలాల నుండి తొలగించడం వాయిదా వేయాలి. వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిపై, చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలపై బ్యాంకుల చాలా ఉదారంగా వ్యవహరింపమని ఆర్‌బిఐ ఆదేశాలు ఇవ్వవలసి ఉంది.

వివిధ ప్రభుత్వ పథకాల క్రింద, ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలతో కూడా రోజువారీ వేతనాలపై పని చేస్తున్న వారికి, తాత్కాలిక ఉద్యోగులకు కనీసం వారి వేతనాలలో కొద్దీ మొత్తం చెల్లించే ఏర్పాట్లు చేయాలి. డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు వంటి వారికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకం ప్రకటించాలి. దేశంలో ఆహారం, మందులు లేక ఎవ్వరూ ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అందుకోసం అవసరమైతే ఇళ్ల వద్దనే వాటిని అందించే ఏర్పాట్లు చేయాలి. ప్రతి రాష్ట్రంలో మరిన్ని పరీక్షా కేంద్రాలను ప్రారంభించాలి. మాస్క్ లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకొని, విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే చర్యలు తీసుకోవాలి. ఉచిత వైద్యం అందుబాటులోకి తేవాలి. ప్రైవేట్ ఆసుపత్రులు సహితం ఉదారంగా వ్యవహరించే విధంగా చూడాలి. వివిధ రాష్ట్రాలలో స్థానిక ప్రజలు పలు అంశాలపై నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వారిని ప్రస్తుతంకు విరమించి, కరోనాను ఎదుర్కోవడంలో కలసి రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్ది చెప్పాలి.

PM Modi address to the nation on Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై ప్రధాని హితోక్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: