చరిత్రాత్మక సమావేశాలు

  ఇటీవల జరిగిన శాసనసభ, శాసనపరిషత్ సమావేశాలు చరిత్రాత్మక సమావేశాలు. అనేక కోణాల్లో ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ బడ్జెట్‌లో పెరుగుదల చూపడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశ అభివృద్ధికి ఒక నమూనాగా నిలిచిపోతున్నది. దేశంలో 70 వేల టిఎంసిల నీరు వృధా పోతున్నది. వెయ్యి టిఎంసిలతో కోటి ఎకరాలు సాగవుతాయి. 70 వేల టిఎంసిలతో 70 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇప్పుడున్న […] The post చరిత్రాత్మక సమావేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇటీవల జరిగిన శాసనసభ, శాసనపరిషత్ సమావేశాలు చరిత్రాత్మక సమావేశాలు. అనేక కోణాల్లో ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ బడ్జెట్‌లో పెరుగుదల చూపడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశ అభివృద్ధికి ఒక నమూనాగా నిలిచిపోతున్నది. దేశంలో 70 వేల టిఎంసిల నీరు వృధా పోతున్నది. వెయ్యి టిఎంసిలతో కోటి ఎకరాలు సాగవుతాయి. 70 వేల టిఎంసిలతో 70 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇప్పుడున్న నీటి వనరులకు ఇది అదనం. తాగునీరు, సాగునీరు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని సమావేశాల్లో మరోసారి నొక్కి చెప్పారు ముఖ్యమంత్రి.

ఈ సందర్భంగా భారతదేశ పంచవర్ష ప్రణాళికలు రూపుదిద్దుకున్న తీరు, దాని నేపథ్యం గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రసంగం దానికదే ఒక అంతర్జాతీయ సెమినార్ పత్రం వంటిది. ఇంత చక్కగా మరెవరూ సెమినార్ పత్రం ఈ విషయాలపై దాఖలు చేసినట్టుగా దృష్టికి రాలేదు. 2001లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో కరీంనగర్‌లో ఒక సభ జరిగింది. వార్త దినపత్రిక కరీంనగర్ జిల్లా ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభ అది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కెసిఆర్ ఆరోజు చేసిన ప్రసంగం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి అనే అంశం పై విస్తృతంగా ప్రసంగించారు. అదే ప్రసంగం 20 యేళ్ళ తర్వాత క్యాసెట్టు వేసుకొని విన్నంత చక్కగా మరింత మెరుగు దిద్దిన ప్రసంగం అసెంబ్లీలో చేయడం కెసిఆర్ జ్ఞాపక శక్తికి, అధ్యయనానికి ఇది ఒక నిదర్శనం. దీంతోపాటు సిఎఎ గురించి చేసిన విశ్లేషణ శాసనసభ్యులకు, అధికారులకు, దేశానికి శాసనసభ వేదికగా దేశం గురించి, అభివృద్ధి ప్రణాళికల గురించి శిక్షణా తరగతులు నిర్వహించినట్లయింది.

సిఎఎ (భారతీయ పౌరసత్వ సవరణ చట్టం) అని దానిని తెలుగులో పిలువవచ్చు. భారత రాజ్యాంగంలోని ఐదవ ఆర్టికల్ నుండి పదకొండవ ఆర్టికల్ దాకా గల భారతీయ పౌరసత్వ మార్గదర్శకాలను, చట్టాలను సవరిస్తూ చేసిన సిఎఎ చట్టం ఎక్కడికి దారి తీస్తుందో కెసిఆర్ చెప్పిన తీరు అరటిపండు వలచి పెట్టినంత సులభంగా అర్థం చేయించారు. జాతీయ జనాభా రిజిష్టర్ రూపొందించడానికి సిఎఎ ఒక తొలి అడుగు. ఈ రెండు ఎంత ప్రమాదకరమైనవో ప్రజలను ఎంత ఇబ్బంది పెడతాయో వివరించిన తీరులో అనేక కొత్త కోణాలను ముందుకు తెచ్చారు. ఓటర్ల లిస్ట్ పౌరులుగా లెక్కించడానికి పనికిరాకపోతే, ఈ ఓటర్ల లిస్టుతో ఎన్నికైన ప్రధానమంత్రి ఎన్నిక ఎట్లా చెల్లుతుంది అనే కొత్త ప్రశ్న ప్రధానమంత్రిని బిజెపి ప్రభుత్వ నిర్మాణాన్ని, దాని అస్తిత్వాన్ని కూల్చివేసే ప్రశ్న ఇది.

నైతికంగా బిజెపి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన స్థితికి దారి తీసే ప్రశ్న. ఈ ప్రశ్నతో దేశం ముందుకు సాగితే ఆయా పార్టీలు ఉద్యమాలు నిర్మిస్తే, బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రంలో రాజీనామా చేసి సిఎఎ చట్టసవరణను ముందుకు తీసుకొని ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. తద్వారా ఇప్పుడున్న పౌరులు, ఓటర్లు ప్రజాప్రతినిధులను ఎన్నికున్న ప్రభుత్వం. ఆ పౌరులనే ఈ దేశ పౌరులు కాదు అని ముద్రగుద్దే అహంకారానికి జవాబు లభిస్తుంది. ఈ దేశానికి ఆర్యులు మొదలుకొని కుషానులు, గ్రీకులు, అరబ్బులు, యూరప్ వాసులు శతాబ్దాలుగా వచ్చి స్థానికులతో యుద్ధాలు చేశారు. రాజ్యాలు స్థాపించారు. కలిసిపోయారు. మతాలు కూడా అలాగే విస్తరించాయి. బౌద్ధం, జైనం, హిందూ మతం అని పిలువబడే మతాలు అనేక దేశాల్లోకి విస్తరించాయి. శతాబ్దాల చరిత్రను తిరగతోడాలనుకోవడం. ప్రజాస్వామ్య పూర్వ దశలకు సమాజాన్ని వెనక్కి తిప్పడం. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం మేల్కొన్నది. ఐక్యరాజ్య సమితిని రూపొందించుకున్నది.

ప్రజాస్వామ్య వ్యవస్థల ఆవశ్యకతను గుర్తించింది. ప్రజల ఓటు హక్కు, ప్రజల సమ్మతి పరిపాలనకు అవసరమని పాలకులు, ప్రభుత్వాలు గుర్తించారు. రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం మలుపు తిరిగిన సామాజిక, రాజకీయ తాత్వికతలు, నిర్మాణాలు, వ్యవస్థల గురించి ఆర్.ఎస్.ఎస్. బిజెపి శక్తులు తెలిసి కూడా ప్రజాస్వామ్యం ద్వారా నియంతృత్వం అమలు జరపాలని కోరుకున్న ఫ్రాన్స్ నియంత, జర్మనీ నియంతలవలె ఆలోచిస్తున్నారు. వీరికి కెసిఆర్ ప్రసంగం చక్కని సమాధానం. శతాబ్దాలుగా ఎన్నో జాతులను, మతాలను, వలసలను, వలస వచ్చిన వారిని కలుపుకుని శాంతియుతంగా సహజీవనం చేస్తున్న సెక్యులర్ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందని ఒక అంబేడ్కర్‌వలె కెసిఆర్ చేసిన ప్రసంగం అందరికీ ఒక కనువిప్పు.

మతం పేరిట రాజకీయాలు చేస్తూ, ఆర్ధిక విషయాలలో జరుగుతున్న మోసాలను కొన్ని సామాజిక వర్గాలే అన్నీ దోచుకుతినడాన్ని బట్ట కప్పి మాయ చేస్తున్నారు. ఇది ఎంతో కాలం చెల్లదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరినప్పుడల్లా యుద్ధాలను, అంతర్యుద్ధాలను, సామాజిక సంఘర్షణలను ప్రోత్సహించడం, ముందుకు ఉరకడం చరిత్రలో కొత్తేమి కాదు. దాని పర్యవసానాలతో దేశాలు విచ్ఛిన్నమయ్యాయి. ఈ దేశం గతంలోవలె ఉండాలని, కోరుకునే శక్తులు గమనించాల్సిన అంశం ఏమంటే, గతంలోవలె ఉండాలనుకుంటే, గతంలోవలెనే ఈ దేశం అనేక రాజ్యాలుగా, దేశాలుగా విడిపోతుందని. యూరప్‌లో భాషల వారీగా దేశాలుగా విడిపోయాయి. మన దేశంలో కూడా భాషల వారీగా, ప్రాంతాల వారీగా సోవియట్ యూనియన్ పదమూడు దేశాలుగా విడిపోయినట్లుగా విడిపోవడం ఎంతో దూరంలో లేదు. ఎనిమిది రాష్ట్రాలు ధైర్యంగా సిఎఎను వ్యతిరేకిస్తూ తీర్మానించాయంటే ఇండియన్ యూనియన్‌కు రాష్ట్రాలకు మధ్యన సంఘర్షణ మొదలైందని అర్థం.

బింద్రన్‌వాలే హత్య, ఇందిరాగాంధీ హత్య వంటి సంఘటనలను మర్చిపోవడమే చరిత్రకు అవసరం. నిన్న జరిగిన మానభంగాలను, అత్యాచారాలను మర్చిపోయి మానవీయ సంబంధాలతో సగౌరవంగా జీవించడం అవసరం. అందువల్ల చరిత్రను తవ్వి తీసి, సంఘర్షణలను రెచ్చగొట్టాలనుకునే తత్వాలు, ప్రణాళికలు, ప్రచారాలు మంచివి కావు. బిజెపి శక్తులు ఆర్థిక సంక్షోభాన్ని, అభివృద్ధి మందగింపును అసమర్ధ ప్రణాళికా అభివృద్ధిని గుర్తించకుండా నిరంతరం ప్రజలపైకి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా మనస్సులను దారి మళ్లిస్తున్నాయి. ఈ నిరంతర సంఘర్షణ ప్రజలు సహించలేరు. భరించలేరు. ఇండియా, పాకిస్థాన్‌గా విడిపోయిన నాటి సంఘర్షణలను ఎవరూ గుర్తు చేసుకోవడం లేదు. మరుగున పడడమే శాంతియుత సహజీవనానికి అవసరం. పది, పదిహేను సంవత్సరాలు ఉంటేనే అమెరికాలో పౌరసత్వం ఇస్తున్నారు. నూతన దేశంగా నిర్మాణమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల తీరు ప్రపంచానికి ఒక ఆదర్శం. అన్ని దేశాల ప్రజలకు సమాన అవకాశాలు ఇస్తూ, ఒక దేశంగా అభివృద్ధి చెందుతున్నది అమెరికా.

ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను ఆమోదించడం, బడ్జెట్ పద్దులలో పేదలకు డబుల్ బెడ్‌రూవ్‌ు పథకం కోసం రూ. పది వేల కోట్లు కేటాయించడం ఒక విశేషం. 530 టిఎంసిల నీరు ఇప్పుడు గత నాలుగైదేళ్ళలో వాడుకంలోకి తీసుకురావడం జరిగిందని ప్రకటించారు. తద్వారా టిఎంసికి పదివేల ఎకరాల చొప్పున 53 లక్షల ఎకరాలకు నీరు అందించినట్లయింది. ఇది అదివరకే ఉన్న అర కొర నీటి వసతులకు అదనపు చేర్పు. కాబట్టి టిఎంసికి ఆరున్నర వేల ఎకరాలకు బదులుగా పదివేల ఎకరాలు సాగవుతుందని లెక్క కట్టడం జరుగుతున్నది. ఇంకా మూడు వందల టిఎంసిల నీరు ఉపయోగంలోకి తెస్తూ, మొత్తం కోటి ఎకరాల సాగు చేయడం లక్ష్యంగా ప్రకటించిన తీరు ఆత్మ విశ్వాసాన్ని, వేగవంతమవుతూ జీవితాల్లో ఫలితాలిస్తున్న ప్రాజెక్టులే నిదర్శనం.

జీతాలు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. పెన్షన్లు పెరుగుతున్నాయి. విద్యుత్ సంస్థ స్వయం పోషకంగా ఎదగాలి. ఆర్‌టిసి స్వయం పోషకంగా ఎదగాలి. పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తూ, విద్యుత్ చార్జీలు పెంచుతాము అని ప్రకటించడం, ప్రజలను అందుకు అనువుగా సమాయత్తం చేయడమే. ఆర్‌టిసి చార్జీలు పెంచినప్పుడు కూడా కెసిఆర్ ఇలా ప్రజలను సమాయత్తం చేస్తూ వచ్చారు. కానీ, కేంద్రం ఒకవైపు క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుతుంటే రేటు తగ్గించే బదులు మరో మూడు రూపాయలు పెంచి వడ్డించడం, దానిపై ప్రజలకు ఏ వివరణ ఇవ్వక పోవడం ప్రజలపట్ల జవాబుదారీ తనం లేకపోవడమే. గ్యాస్ సిలిండర్ ధర పెంచడంలో గానీ, బ్యాంకులకు లక్షల కోట్లు వితరణ చేయడంలో గానీ, ప్రజల సమ్మతి తీసుకోలేకపోయారు. ఇలాంటి అనేక చర్యలను మరిపించడానికి సిఎఎ వంటి చర్చలను, సంఘర్షణలను కావాలని ముందుకు తెస్తున్నారని అసలు విషయాలను ముఖ్యమంత్రి హోదాలో సోదాహరణంగా వివరించడం దేశానికి ఒక కొత్త చూపును అందిస్తుంది.

KCR gives in principle consent to supply water

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చరిత్రాత్మక సమావేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.