అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హత్యలో కొత్త ట్విస్ట్

  హైదరాబాద్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డిగ్యాంగ్ ఆనంద్ రెడ్డి తో పాటు అతని సోదరుడు కృష్ణారెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనకు రావాల్సిన రూ. 80లక్షలు ఇవ్వాలని ఆనంద్‌రెడ్డి తరచూ ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించాడు. ఈక్రమంలో ఆనంద్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సైతం పలుమార్లు తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్లు చేశాడు. […] The post అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హత్యలో కొత్త ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డిగ్యాంగ్ ఆనంద్ రెడ్డి తో పాటు అతని సోదరుడు కృష్ణారెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనకు రావాల్సిన రూ. 80లక్షలు ఇవ్వాలని ఆనంద్‌రెడ్డి తరచూ ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించాడు. ఈక్రమంలో ఆనంద్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సైతం పలుమార్లు తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్లు చేశాడు. దీంతో ప్రదీప్‌రెడ్డి ఎలాగైన ఆనంద్‌రెడ్డి, అతని సోదరుడు కృష్ణారెడ్డిలను హత్య చేయాలని కుట్రపన్నాడు. ఇందులో భాగంగా తనకు ఓ లావాదేవీ వ్యవహారంలో రూ.80 లక్షలు వస్తాయంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డిని నమ్మించాడు.

ఈక్రమంలో ఆనంద్‌ను భూపాలపల్లికి పిలిపించాడు. భూపాలపల్లికి ఆనంద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి సహా మరికొందరు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్న అనంతరం భూమి, డబ్బుల గురించి డిస్కస్ చేద్దామని చెప్పి రాంపూర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి ఆనంద రెడ్డిని తీసుకెళ్లారు. అయితే భూమి చూడటానికి రావాలని ఆనంద్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని కూడా పిలిపించినట్లు తెలుస్తోంది. అడవిలో ఫోన్ సిగ్నల్ దొరకక పోవడంతో చాలా సేపు వేచిచూసి ఆనంద్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో నిందితులు కృష్ణారెడ్డి ఇక రాడని తెలుసుకున్న తరువాత అక్కడే ఆనంద్ రెడ్డి కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు వెనక్కికట్టేసి గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హత్యకు ఉపయోగించిన కారును సర్వీసింగ్ చేయించారు.

కాగా ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సహా నిందితులు పరారీలో ఉన్న విషయం విదితమే. ఈ కేసులో పట్టుబడిన నిందితులను పోలీసులు తమదైనశైలిలో విచారిస్తే నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్‌టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్‌టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కాగా నిందితులు హైదరాబాద్‌నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్‌రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌రెడ్డి బంధువులు పోలీస్‌విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్‌పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది. కాగా ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టులో లొంగిపోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హత్యతో సంబంధం లేదు : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో సిఐ ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాన నిందితుని సోదరుడు హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు కలిచివేశాయని ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు. తన 24 ఏళ్ల సర్వీసులో ఏ చిన్న తప్పు కూడా చేయలేదని, ఇలాంటి ఆరోపణ ఎప్పుడు రాలేదని స్పష్టంచేశారు. కానీ ఆనంద్ రెడ్డి హత్య కేసులో తన పేరు రావడం బాధ కలిగించిందని చెప్పారు.

New twist in assassination of assistant labor officer

The post అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హత్యలో కొత్త ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: