ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తు.. అనంతలోకాలకు

ఖమ్మం : ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థుల బైక్ రోడ్డు ప్రమదానికి గురైన ఘటన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం పొన్నెకల్‌ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఇంటర్‌ పరీక్ష రాయడానికి ఇద్దరు విద్యార్థులు బైక్‌పై పరీక్ష కేంద్రానికి ప్రయాణిస్తున్నారు. బండి వేగం పెంచడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా… మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే స్పందించిన స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం […] The post ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తు.. అనంతలోకాలకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థుల బైక్ రోడ్డు ప్రమదానికి గురైన ఘటన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం పొన్నెకల్‌ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఇంటర్‌ పరీక్ష రాయడానికి ఇద్దరు విద్యార్థులు బైక్‌పై పరీక్ష కేంద్రానికి ప్రయాణిస్తున్నారు. బండి వేగం పెంచడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా… మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే స్పందించిన స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికులు సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడిని డోర్నకల్‌కు చెందిన వివేక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

intermediate student death in road accident at khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తు.. అనంతలోకాలకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.