చరిత్రను కామన్ సబ్జెక్ట్ చెయ్యాలి

  చరిత్ర ఆనాటి నుండి నేటి వరకు మానవ నాగరికతకు చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, అభివృద్ధి విషయాలు తు.చ. తప్పకుండా వివరిస్తుంది. అలాంటి చరిత్రను విస్మరించడం, చరిత్ర ఎందుకు అని ప్రశ్నించడం అమాయకత్వమైన భావనగా చెప్పవచ్చును. ప్రతి దేశం తన చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల పరిశోధనలు చేసుకొని గత కాలపు అనుభవాలను నమోదు చేసుకొని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను చారిత్రక దృష్టితో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను నిర్లక్ష్యం చేసిన దేశం, […] The post చరిత్రను కామన్ సబ్జెక్ట్ చెయ్యాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చరిత్ర ఆనాటి నుండి నేటి వరకు మానవ నాగరికతకు చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, అభివృద్ధి విషయాలు తు.చ. తప్పకుండా వివరిస్తుంది. అలాంటి చరిత్రను విస్మరించడం, చరిత్ర ఎందుకు అని ప్రశ్నించడం అమాయకత్వమైన భావనగా చెప్పవచ్చును. ప్రతి దేశం తన చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల పరిశోధనలు చేసుకొని గత కాలపు అనుభవాలను నమోదు చేసుకొని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను చారిత్రక దృష్టితో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

చరిత్రను నిర్లక్ష్యం చేసిన దేశం, ప్రాంతం, పాలకులు, జాతులు మనుగడలో ఉన్నట్లు దాఖలాలు లేవు. ఒక దేశం తన చరిత్ర సంస్కృతిని తెలుసుకోని యెడల వేర్లు లేని చెట్టువలె ఉంటుంది. అలాగే ఆ దేశంలోని విద్యార్థులకు ముఖ్యంగా యువతకు చరిత్ర జ్ఞానం లేనిచో నిర్వీర్యం అవుతారు. నేటి విద్యార్థులలో చరిత్ర స్పృహలేకపోవడం వల్ల దేశం, మతాల, జాతీయ నాయకుల, తల్లిదండ్రుల, గురువులు, వారు నివసించే సమాజం పట్ల సరైన వైఖరి కలిగి ఉండడం లేదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో దిశలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కౌమార దశలోని విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చెయ్యాలని, దీనికి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ ద్వారా పాఠ్యప్రణాళికలను తయారు చేయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నేటి విద్యా విధానంలో నూతన మార్పుకు శ్రీకారం, హర్షించదగినది. అయితే నైతిక విలువలతో కూడిన విద్యాబోధన ఎలా జరగాలి? ఎలా ఉండాలి ? అనే అంశాలపై మనం కొంత చర్చించవలసిన అవసరం ఉంది. మానవీయ, నైతిక విలువలతో కూడిన విద్యా బోధన నూటికి నూరు శాతం సామాజిక శాస్త్రాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి విలువలను బోధించగలిగే సామాజిక శాస్త్రాలలో చరిత్ర ముఖ్యమైనది.

చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, విప్లవాలు అని చాలామందికి అపోహ. కానీ మానవ జీవన వికాసాన్ని వివరిస్తూ, భవిష్యత్ తరాలకు గుణపాఠాలను చరిత్ర అందిస్తుంది. 18వ శతాబ్దానికి ముందు చరిత్ర రాజ్యాలు, రాజులు, రాణులు, యుద్ధాలు, విప్లవాల గురించి మాత్రమే వివరించేది. కానీ నేడు చరిత్ర మానవుని సమగ్ర కార్యకలాపాలను వివరిస్తుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో చరిత్ర పరిజ్ఞానం సమస్త మానవాళికి అవసరం. మానవ జాతికి భవిష్యత్తులో వచ్చే సమస్యలను పరిష్కరించుకునే వివేకం చరిత్ర పరిజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

చరిత్ర ఎందుకు? చరిత్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? చరిత్రను ఎందుకు చదవాలి? చరిత్రను అధ్యయనం చేస్తే ఉద్యోగాలు వస్తాయా? ఇటువంటి ప్రశ్నలు విద్యార్థుల నుండే కాకుండా ఉన్నతాధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి నేడు అధికంగా తలెత్తుతున్నాయి. అలాగే చరిత్రను ఒక పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుగానే పరిగణిస్తున్నారు. ఒక వైపు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతుండడం వలన తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు కూడా ఇంజినీరింగ్, మెడిసిన్, సాఫ్ట్‌వేర్ తదితర కోర్సుల వైపు మొగ్గు చూపుతూ సామాజిక శాస్త్రాల కలయికతో కూడిన కోర్సుల పట్ల ముఖ్యంగా చరిత్రతో ముడిపడిన కోర్సుల పట్ల నిరాసక్తతను చూపుతున్నారు.

చరిత్ర ఆనాటి నుండి నేటి వరకు మానవ నాగరికతకు చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, అభివృద్ధి విషయాలు తు.చ. తప్పకుండా వివరిస్తుంది. అలాంటి చరిత్రను విస్మరించడం, చరిత్ర ఎందుకు అని ప్రశ్నించడం అమాయకత్వమైన భావనగా చెప్పవచ్చును. ప్రతి దేశం తన చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల పరిశోధనలు చేసుకొని గత కాలపు అనుభవాలను నమోదు చేసుకొని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను చారిత్రక దృష్టితో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను నిర్లక్ష్యం చేసిన దేశం, ప్రాంతం, పాలకులు, జాతులు మనుగడలో ఉన్నట్లు దాఖలాలు లేవు. ఒక దేశం తన చరిత్ర సంస్కృతిని తెలుసుకోని యెడల వేర్లు లేని చెట్టువలె ఉంటుంది. అలాగే ఆ దేశంలోని విద్యార్థులకు ముఖ్యంగా యువతకు చరిత్ర జ్ఞానం లేనిచో నిర్వీర్యం అవుతారు.

నేటి విద్యార్థులలో చరిత్ర స్పృహలేకపోవడం వల్ల దేశం, మతాల, జాతీయ నాయకుల, తల్లిదండ్రుల, గురువులు, వారు నివసించే సమాజం పట్ల సరైన వైఖరి కలిగి ఉండడం లేదు. సమాజంలో ఏదైనా అలజడి ప్రారంభమయితే, దాని పూర్వాపరాలు తెలుసుకొనే జ్ఞానం లేకపోవడంవల్ల యువత చేసే కార్యక్రమాలను ప్రభుత్వాలు, పాలకులు నిలువరించలేకపోతున్నారు. చరిత్ర అన్ని శాస్త్రాలకు తల్లివంటిది. సాంకేతి అభివృద్ధి మత్తులో తల్లిలాంటి శాస్త్రానికు నేటి విద్యావ్యవస్థలో చోటు లేకపోవడం శోచనీయం. సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు. కానీ సమాజ అభివృద్ధికై తోడ్పడే చరిత్ర పట్ల నిర్లక్ష్యం వహించడం సబబు కాదు.

ప్రపంచంలోని అగ్రరాజ్యాలవలే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల చరిత్ర బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. చరిత్ర చదివిన ఒక విద్యార్థి ఒక డాక్టర్ కాకపోవచ్చు, ఇంజినీర్ కాకపోవచ్చు. కానీ ఒక సమాజంలో మానవీయ, నైతిక విలువలతో కూడిన సామాజిక తార్కిక ఆలోచనలు కలిగిన పరిపూర్ణుడు అవుతానడంలో సందేహంలేదు. ఒక డాక్టర్ రోగికి రోగం నయం చేయాలంటే రోగి లక్షణాలు, రోగం కారణాలు, రోగి ఎంత కాలం నుండి బాధపడుతున్నాడు, ఆ రోగం వంశపారంపర్యమైనదా లేదా, ఆ రోగం గతంలో ఏ విధంగా నయం అయింది అనే గతానికి సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసిన తర్వాతనే చికిత్స చేస్తాడు. అదే విధంగా ప్రతిసారి చికిత్స చేసే ముందు గత రికార్డును పరిశీలించడం జరుగుతుంది.

అలాగే ఒక ఇంజినీర్ కూడా భావితరాలకు ఉపయోగపడే నీటి ప్రాజెక్టును రూపకల్పన చేయడంలో రిజర్వాయర్ ఎంత కాలం నుండి ఉంది దానికి వచ్చే నీటి మార్గాలు గతంలో ఎంత నీరు నిల్వ ఉండేది. వంటి గతానికి చెందిన పలు విషయాలను అధ్యయనం చేస్తాడు. అదే విధంగా ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోరే ఒక పథకాన్ని రూపకల్పన చెయ్యాలంటే ప్రజల అభివృద్ధికి సంబంధించి గత విషయాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్తుంది. పై విషయాలను బట్టి డాక్టరైనా, ఇంజినీరైనా, ప్రభుత్వమైనా గత అధ్యయనం ద్వారానే తమ పని తీరును మెరుగుపర్చుకుంటాయి.

గత ప్రభుత్వాలు మోడల్, కస్తూర్భా, యస్. సి. సోషల్ వెల్ఫేర్, బి.సి. వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో చరిత్ర సబ్జెక్ట్‌ను ప్రవేశ పెట్టక నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించాయి. ప్రస్తుతం ఉద్యమ నాయకుడైన కె.సి.ఆర్ ప్రభుత్వం కూడా 2020 21 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ పాఠశాలలను, 2021 22 విద్యా సంవత్సరంలో 119 బి. సి. పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. కానీ ఈ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టిన కోర్సులలో హెచ్‌ఇసి. గ్రూప్‌ను పెట్టకపోవడం శోచనీయం. అలాగే చరిత్రను కనీసం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా కూడా పరిగణించడం లేదు.

సాంకేతికాభివృద్ధి తోడుగా సమాజాభివద్ధి జరగాలంటే సాంకేతిక కోర్సులతో పాటు సామాజిక శాస్త్రాలకు సంబంధించిన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజాభివృద్ధి జరిగిన ప్రాంతంలో సాంకేతికాభివృద్ధి త్వరగా జరుగుతుంది. ప్రభుత్వాలు పూర్తిగా సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే సమాజాభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మానవీయ, నైతిక విలువలతో కూడిన విద్యా బోధనకై ఇంటర్, డిగ్రీ విద్యలో చరిత్రను కామన్ సబ్జెక్టుగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఆంధ్ర వలసవాదులు ఒక వైపు విద్యను నిర్లక్ష్యం చేస్తూ, మరోవైపు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని కనుమరుగు చేశారని ఉద్యమకారులు పదే పదే నిందించిన విషయం తెలిసిందే.

భారత జాతీయోద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కెసిఆర్ ప్రపంచంలోనే శాంతియుత మార్గాల ద్వారా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపి అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఘనుడు. ఆయన సారథ్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భావి తరాలకు అందించాలంటే ఇంటర్, డిగ్రీలలో చరిత్రను కామన్ సబ్జెక్టుగా తీసుకురావాలని మేధావి వర్గం కోరుతోంది. కెసిఆర్ తెలంగాణ విద్యా విధానంలో చరిత్రను కామన్ సబ్జెక్టుగా చేసి నూతన మార్పుకు శ్రీకారం చుడతాడని ఉద్యమ లోకం ఎదురుచూస్తున్నది.

CM KCR Over Disha Encounter In Assembly

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చరిత్రను కామన్ సబ్జెక్ట్ చెయ్యాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: