నా భర్తను దుబాయ్ నుంచి రప్పించండి సారూ…

  నర్సాపూర్ : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తన భర్త కొర్ర హ్యోభ్య ను సొంతగ్రామానికి రప్పించాలని ఆయన భార్య సుగుణ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీసా గడువు మూగిసినప్పటికీ హ్యోభ్య అక్కడే ఉండడంతో మూడు నెలల క్రితం దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి భార్య కొర్ర సుగుణ తెలిపిన వివరాల ప్రకారం … మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జు తండాకు చెందిన,కొర్ర హ్యోభ్య మేస్త్రీ పనిచేసేవాడు. […] The post నా భర్తను దుబాయ్ నుంచి రప్పించండి సారూ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నర్సాపూర్ : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తన భర్త కొర్ర హ్యోభ్య ను సొంతగ్రామానికి రప్పించాలని ఆయన భార్య సుగుణ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీసా గడువు మూగిసినప్పటికీ హ్యోభ్య అక్కడే ఉండడంతో మూడు నెలల క్రితం దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి భార్య కొర్ర సుగుణ తెలిపిన వివరాల ప్రకారం … మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జు తండాకు చెందిన,కొర్ర హ్యోభ్య మేస్త్రీ పనిచేసేవాడు. పేదరికం కారణంగా ఉపాథికోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబానికి డబ్బు పంపించేవాడు.

దుబాయ్ వెళ్లి తిరిగొచ్చే సమయంలో మూడు నెలలు ఆలస్యం కావడంతో దుబాయ్ పోలీసులు హ్యోభ్యను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ విషయాన్ని తన భర్త తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని ఆయన భార్య సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అరెస్టు కావడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, వీసా గడువు ముగిసిన తరువాత 608 రోజులు తన భర్త అక్కడే ఉన్న కారణంగా అరెస్టు చేసినట్టు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తను దుబాయ్ పోలీసుల చెర నుంచి విడిపించాలని ఆమె కోరారు.

TS man arrested by Dubai police after her visa expired

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా భర్తను దుబాయ్ నుంచి రప్పించండి సారూ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: