ఒప్పో నుంచి ‘రెనో 3ప్రో’ స్మార్ట్‌ఫోన్…

  న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మరో మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌కు పరిచాయం చేసింది. ‘ రెనో 3ప్రో’ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు వెనకవైపు 64 మెగా పిక్సెల్‌తో పాటుగా మరో మూడు కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్టోరేజి ఆధారంగా రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. రెనో 3ప్రో 128జిబి, 256 […] The post ఒప్పో నుంచి ‘రెనో 3ప్రో’ స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మరో మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌కు పరిచాయం చేసింది. ‘ రెనో 3ప్రో’ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు వెనకవైపు 64 మెగా పిక్సెల్‌తో పాటుగా మరో మూడు కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్టోరేజి ఆధారంగా రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. రెనో 3ప్రో 128జిబి, 256 జిబి వేరియంట్లలో లభించనుంది.

8జిబి/128 జిబి వేరియంట్ ధర రూ.29,990గా నిర్ణయించగా ఇది మార్చి 6నుంచి ఫ్ఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యం కానున్నట్లు తెలిపింది. కాగా 256 జిబి వేరియంట్ ధర రూ.32,990 ఉంటుందని తెలిపింది. అయితే ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ఈ రెండు వేరియంట్లు ఆరోరల్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, స్కై వైట్ కలర్లలో లభిస్తాయని పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కార్డుల ద్వారా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం దాకా క్యాష్‌బ్యాక్ పొందవచ్చని సంస్థ తెలిపింది. దీతో పాటుగా సంస్థ ఎంకో వైర్‌లెస్ సెట్లపైన రూ.2వేల ఆఫర్ ప్రకటిస్తోంది.

ఒప్పో ‘రెనో 3ప్రో’ ఫీచర్లు
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 10, కలర్ ఒఎస్ 7 సాఫ్ట్‌వేర్ ఆధారంగా పని చేస్తుంది. ఇది 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 8జిబి ర్యామ్‌తో కూడిన, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పి95 ఎస్‌ఓసి ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్‌సైడ్ నాలుగు కెమెరాలుంటాయి. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,13 ఎంపి టెలీఫొటో షూటర్, 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపి మోనో సెన్సార్ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీ కోసం 44 ఎంపి, 2 ఎంపి సామర్థంతో డ్యుయల్ హోల్‌పంచ్ కెమెరాలను అమర్చారు. వీటితో పాటు 4 జి వోల్టే, వైఫై 802.11 ఎసి, బ్లూటూత్, జిపిఎస్ ఎజిపిఎస్, యుఎస్‌బి టైప్‌సి పోర్ట్ కనెక్టివిటీ,ఆన్‌స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.4025 ఎంఎహెచ్ సామర్థం కలిగిన బ్యాటరీని మొబైల్‌కు జోడించారు.

Oppo launches Reno 3 Pro in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒప్పో నుంచి ‘రెనో 3ప్రో’ స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.