ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి: కెటిఆర్

  ఖమ్మం: ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని మంత్రి కెటిఆర్ మున్సిపల్ కార్మికులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ముస్తాఫా నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి కెటిఆర్ ముచ్చటించారు. అనంతరం ఖమ్మం గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్త, మురికిని తొలగించేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవాలని సూచనలు చేశారు. కార్మికుల జీతభత్యాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించి, సిసి టివిలను పరిశీలించారు. […] The post ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని మంత్రి కెటిఆర్ మున్సిపల్ కార్మికులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ముస్తాఫా నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి కెటిఆర్ ముచ్చటించారు. అనంతరం ఖమ్మం గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్త, మురికిని తొలగించేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవాలని సూచనలు చేశారు. కార్మికుల జీతభత్యాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించి, సిసి టివిలను పరిశీలించారు. మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖమ్మం రూపురేఖలు మారుతున్నాయని, హైదరాబాద్, వరంగల్ తరహా ఖమ్మం అభివృద్ధి చెందుతోందన్నారు. ఖమ్మంలో చదువుకున్న వారికోసం ఐటి హబ్ తీసుకొచ్చామని కెటిఆర్ వివరించారు. మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Health is important says KTR in Pattana Pragati

The post ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: