ఔషధాలపై కరోనా ప్రభావం

  భారత్‌లో అత్యవసర మందుల జాబితాలో 75 శాతం మందులకు చైనా నుంచి దిగుమతి అయ్యే ‘ఎపిఐ’ లే ఆధారం. ప్రపంచ దేశాలన్నిటికంటే చైనా తయారు చేసే ‘ఎపిఐ’ లే చాలా తక్కువ ధరలకు లభిస్తుంటాయి. మన దేశంలో కూడా ఎపిఐ ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవి లేవు. ఎపిఐల కోసం చైనాపై మన దేశం ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పటికిప్పుడే సమస్య ఎదురు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా ఆలోచించవలసి వస్తుంది. ఈ […] The post ఔషధాలపై కరోనా ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత్‌లో అత్యవసర మందుల జాబితాలో 75 శాతం మందులకు చైనా నుంచి దిగుమతి అయ్యే ‘ఎపిఐ’ లే ఆధారం. ప్రపంచ దేశాలన్నిటికంటే చైనా తయారు చేసే ‘ఎపిఐ’ లే చాలా తక్కువ ధరలకు లభిస్తుంటాయి. మన దేశంలో కూడా ఎపిఐ ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవి లేవు. ఎపిఐల కోసం చైనాపై మన దేశం ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పటికిప్పుడే సమస్య ఎదురు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా ఆలోచించవలసి వస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన దేశ ఆరోగ్య భద్రతకు చాలా కాలం నుంచి హెచ్చరికలు, సూచనలు వస్తున్నాయి.

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభావం అనేక పరిణామాలకు దారి తీస్తోంది. ఇతర దేశాలకు ఇది విస్తరించడమే కాదు ప్రపంచంలోని విమాన సర్వీసులకు తీవ్ర ప్రతిబంధంగా తయారు కావడమే కాక ఆటోమొబైల్, ఉత్పత్తుల తయారీ, పారిశ్రామిక, వైద్య రంగాలను పట్టి పీడిస్తోంది. భారత దేశానికి సంబంధించి ఔషధాల తయారీ చైనా ముడి పదార్థాలపై చాలా వరకు ఆధారపడి ఉండడం తీరని సమస్యగా పరిణమిస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఔషధాలను తక్కువ ధరలకు తయారు చేయడంలో భారత్ ప్రత్యేకత సాధించింది. జెనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు తయారు చేసి విదేశాలకు భారత్ ఉత్పత్తిదారులు సరఫరా చేయడం పరిపాటిగా వస్తోంది. దీనివల్ల స్వదేశీ, విదేశీ ఔషధ అవసరాలు బాగా నేరవేరుతున్నాయి. అయితే ఈ ఫార్మాస్యూటికల్ (ఔషధాల తయారీ) పరిశ్రమకు కావలసిన కీలకమైన ముడి పదార్థాలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్ ఎపిఐ) అత్యధిక శాతం చైనా నుంచే భారత్‌కు దిగుమతి అవుతుంటాయి.

ఈ ఎపిఐల వల్లనే ఔషధాల తయారీ గత కొన్నేళ్లుగా సాగుతోంది. భారత్‌లో అత్యవసర మందుల జాబితాలో 75 శాతం మందులకు చైనా నుంచి దిగుమతి అయ్యే ‘ఎపిఐ’ లే ఆధారం. ప్రపంచ దేశాలన్నిటికంటే చైనా తయారు చేసే ‘ఎపిఐ’ లే చాలా తక్కువ ధరలకు లభిస్తుంటాయి. మన దేశంలో కూడా ఎపిఐ ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవి లేవు. ఎపిఐల కోసం చైనాపై మన దేశం ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పటికిప్పుడే సమస్య ఎదురు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా ఆలోచించవలసి వస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన దేశ ఆరోగ్య భద్రతకు చాలా కాలం నుంచి హెచ్చరికలు, సూచనలు వస్తున్నాయి.

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, భారత పారిశ్రామిక కూటమి 2013 లో నిర్వహించిన అధ్యయనంలో ఎపిఐల మొత్తం దిగుమతులు, ఆయా మధ్యవర్తిత్వాలు ఏటా 18శాతం వరకు పెరుగుతున్నాయని వెల్లడయింది. చైనా ఎపిఐలపై విశేషంగా ఆధారపడడం జాతీయ భద్రతకు తీరని ప్రమాదంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ 2014లో హెచ్చరించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఔషధాల తయారీలో ముడి పదార్థాల దిగుమతులపై ఆధారపడడం రానురాను పెరుగుతుండడం మంచి పరిణామం కాదని, ఇది దేశ ఔషధ తయారీ రంగంపైనే కాక, ఔషధాల అనుసంధానం, ఆరోగ్య భద్రతపై విపరీత ప్రభావం చూపుతుందని రీసెర్చి అండ్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్‌ఐఎస్) 2015 విధాన సమీక్ష హెచ్చరించింది. న్యూఢిల్లీ కేంద్రంగా వర్ధమాన దేశాలకు సంబంధించిన మేధావుల సంస్థగా ఇది పని చేస్తోంది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భారీ ఔషధ తయారీ పార్కులు మూడింటిని దేశంలో ఏర్పాటు చేయడానికి 2018లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ అధ్యయనం సాగించి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఔషధ తయారీ పార్కులు ఏర్పాటు చేయడానికి కావలసిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని సిఫార్సు చేసింది. ఈ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం చైనాలో ఔషధ ముడి పదార్థాల ‘ఎపిఐ’ ఉత్పత్తి ఆగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఔషధాల తయారీకి, సరఫరాకు తీవ్ర విఘాతం తప్పదు.

ప్రపంచం మొత్తం మీద ఎపిఐ ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. 2018లో చైనా నుంచి 208 మిలియన్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. చైనాలో ఎక్కడైతే కరోనా వైరస్ కేంద్రీకృతం అయిందో అక్కడ హుబెయి ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో ఎపిఐ భారీగా ఉత్పత్తి అవుతుంది. వుహాన్ షిజి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎపిఐ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించింది. సైకోయాక్టివ్ డ్రగ్స్ తయారీకి కావలసిన ఎపిఐ ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తుల్లో సగానికి సగం ఎగుమతి అవుతుంటాయి. కాని ఇప్పుడు ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయి. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఎపిఐ ఉత్పత్తి సంస్థ 2018లో 2,47,000 టన్నుల వరకు ఉత్పత్తులు చేయగలిగింది. ఫిబ్రవరి నెలాఖరు అవుతున్నా అక్కడ ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఈ ఎపిఐలపైనే ముఖ్యంగా చైనాపై ఆధారపడితే భారత్‌లో జెనరిక్ ఔషధాల ఉత్పత్తి ఎలా సాధ్యం అవుతుందన్నది ప్రశ్న. చైనా నుంచి యథా ప్రకారం ఎపిఐ ఉత్పత్తులు దిగుమతి లేకుంటే భారత్ పరిస్థితి ఏమిటి?

ఇదిలా ఉండగా కరోనా వైరస్ తలెత్తక ముందే చైనాలో కాలుష్య కారక పరిశ్రమలపై వేటు పడింది. ఇందులో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా ఉండడం గమనార్హం. చైనా నుంచి ఎపిఐల దిగుమతుల ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. గతంలోకి వెళ్తే ఇప్పుడున్నంతగా మన దేశం ఇది వరకు ఎపిఐ ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడేది కాదు. 1991లో చైనా నుంచి ఎపిఐ ఉత్పత్తులు 0.3 శాతం వరకు దిగుమతి కాగా, 2013 నాటికి ఈ దిగుమతులు 47.61 శాతం వరకు పెరిగాయి. ఇటీవల కొన్ని దశాబ్దాలుగా మన దేశ ఔషధ ఉత్పత్తి సంస్థలు చైనా పైనే ఎక్కువగా ఆధారపడడం పరిపాటి అయింది. ప్రపంచ దేశాలన్నింటిలో చైనా ఎపిఐలు అతి తక్కువ ధరకే లభ్యమవుతుండడమే దీనికి కారణం. ఇప్పుడు మన దేశ ఔషధ ఉత్పత్తి సంస్థల్లో మూడు నెలలకు మాత్రమే సరిపడనంత ఎపిఐ ఉత్పత్తుల నిల్వ ఉన్నాయి.

చిన్న, మధ్య తరహా సంస్థల్లో మరో 2025 రోజులకు సరిపడే ఎపిఐ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఎలియిన్స్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుత సమీక్ష ప్రకారం రెండు మూడు నెలల వరకు కావలసిన నిల్వలు ఉన్నాయని, వీటి ఆధారంగా నెల వరకు ఔషధాలు తయారు అవుతాయని తెలుస్తోంది. ఆ తరువాతయినా మామూలు పరిస్థితి ఏర్పడకపోతే చైనా ఎపిఐలపై ఆధారపడే సామాన్య భారతీయుల పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నార్థకం. కేంద్ర ప్రభుత్వం, ఔషధ ఉత్పత్తిదారుల మధ్య ఈ విషయమై ఇటీవల తరచుగా ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వారం దీనిపై తీవ్రంగా చర్చిస్తాయని తెలుస్తోంది. భారత్‌కు చైనా నుంచి ఎపిఐ సరఫరాపై సమీక్షించడానికి డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డిఒపి) ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

దేశంలో ఎపిఐ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించడానికి వీలుగా పర్యావరణ క్లియరెన్సులను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వల్ల త్వరలో చైనాపై ఆధారపడడం తగ్గుతుందని భావిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ పరిస్థితి సులువవుతుందని ఔషధ సంస్థలు చెబుతున్నాయి. అయితే కరోనా ఎంత వరకు నియంత్రణ అవుతుందో అంచనా వేయడం కష్టం. వైరస్ నివారణకు, ఆరోగ్య భద్రతకు సిద్ధం కావడానికి ఆమేరకు బలోపేతానికి కావలసిన పెట్టుబడులు సమకూర్చడానికి భారత్‌తో సహా అనేక దేశాలకు ఇదొక సవాలుగా తయారయింది. కానీ కరోనా వైరస్ సంక్షోభంపై అప్రమత్తం కావలసిన అవసరం ఉంది. ఆరోగ్య భద్రతపరంగా భారత్‌లోని ఎపిఐ తయారీ సామర్థాన్ని మరింత పెంచుకోవడానికి విధానపరమైన అంశంగా ప్రభుత్వం పరిగణించవలసి ఉంటుంది.

China accounted for around 75% of India bulk drug imports

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఔషధాలపై కరోనా ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: