ఢిల్లీలో ‘సాధారణ’ సంకేతాలు

  నెమ్మదిగా రోడ్లపైకి వస్తున్న జనం 42కు చేరుకున్న మృతుల సంఖ్య న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కనీవినీ ఎరుగని మత ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో క్రమేపీ సాధారణ పరిస్థితలు నెలకొంటున్నాయి. గురువారంనుంచి ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగలేదు. మరోవైపు ఈ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరుకుంది. ఈ ఆస్పత్రిలోనే ఇప్పటివరకు 38 మంది చనిపోగా, లోక్‌నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో ముగ్గురు, జగ్ పర్వేష్ చంద్ర ఆస్పత్రిలో […] The post ఢిల్లీలో ‘సాధారణ’ సంకేతాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నెమ్మదిగా రోడ్లపైకి వస్తున్న జనం
42కు చేరుకున్న మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కనీవినీ ఎరుగని మత ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో క్రమేపీ సాధారణ పరిస్థితలు నెలకొంటున్నాయి. గురువారంనుంచి ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగలేదు. మరోవైపు ఈ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరుకుంది. ఈ ఆస్పత్రిలోనే ఇప్పటివరకు 38 మంది చనిపోగా, లోక్‌నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో ముగ్గురు, జగ్ పర్వేష్ చంద్ర ఆస్పత్రిలో ఒకరు చనిపోయారు. శాంత భద్రతల పరిరక్షణకోసం విధి నిర్వమణలో ఉన్న వందలాది మంది ఢిల్లీ పోలీసులకు సహాయంగా దాదాపు 7,000 మంది పారా మిలిటరీ బలగాలను కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మోహరించారు. కాగా అల్లర్లు జరిగిన దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మూడు రోజులుగా జరిగిన అల్లర్ల కారణంగా పగిలిన ఇటుకలు, పగిలిన గాజు ముక్కలు, కాలిన వాహనాలు, ఇతర చెత్తాచెదారాలతో నిండిపోయిన వీథులను పారిశుద్ధ కార్మికులు ఊడ్చి శుభ్రం చేయగా, దుకాణదారులు ఆందోళనకారుల దాడుల్లో ధ్వంసమైన, కాలిపోయిన తమ దుకాణాల్లో మిగిలిపోయిన వస్తువులను సర్దుకోవడం కనిపించింది. ఇక గత మూడు, నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమైన కార్మికులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూనే తమ పనులకోసం వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో షాపులు, దుకాణాలు తెరుచుకోగా, రోడ్లపై ప్రైవేటు వాహనాలు కూడా గతంలోకన్నా ఎక్కువగానే తిరుగుతున్నాయి. జనం ఇళ్లలోంచి బయటికి వస్తూ ఉండడంతో రోడ్లపై ఆటోలు, ఇరిక్షాలు కూడా తిరగడం మొదలైంది.

అయితే శుక్రవారం ప్రార్థనల దృష్టా పోలీసులు, పారా death tollమిలిటరీ బలగాలు మాత్రం అదనపు అప్రమత్తతతో గస్తీ కాయడం కనిపించింది. పుకార్ల కారణంగా స్థానిక ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, వారి భయాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తమ రక్షణకోసం పోలీసులు ఉన్నారని ప్రజలు భావించేలా చూడడమే నా ప్రథమ బాధ్యత అని ఆదివారంనుంచి కొత్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీవాస్తవ చెప్పారు.గత రెండు రోజుల్లో బాధిత ప్రాంతాల్లో 331 శాంతి సమావేశాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో సైతం పుకార్లను నమ్మవద్దని, పోలీసులకు సహకరించాలని కోరుతూ మైకుల్లో అనౌన్స్‌మెంట్లు చేయడం కనిపించింది.

Death toll rises to 42 as GTB Hospital records 4 deaths

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీలో ‘సాధారణ’ సంకేతాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: