సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు

  భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్ (డిసిఎంఎస్ ) డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను టిఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభ్యర్థుల పేర్ల సీల్డ్ కవర్లను టిఆర్‌ఎస్ పార్టీ డిసిసిబి ఎన్నికల పరిశీలకులకు ఇచ్చారు. […] The post సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం
పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత

మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్ (డిసిఎంఎస్ ) డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను టిఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభ్యర్థుల పేర్ల సీల్డ్ కవర్లను టిఆర్‌ఎస్ పార్టీ డిసిసిబి ఎన్నికల పరిశీలకులకు ఇచ్చారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ నూతనంగా నియమించిన డిసిసిబిఎన్నికల పరిశీలకులతో ఆంతరంగికంగా సమావేశమయ్యారు. శనివారం జరగ నున్న డిసిసిబి ఎన్నిల సమయంలో సీల్డ్ కవర్‌లో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి పోటీలో నిలపాలని ఆయన దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి,టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అనేక నివేదికలను, సామాజిక విశ్లేషణలు, అనేక సమీకరణలను పరిశీలించి పేర్లను ఖరారు చేశారని చెప్పారు.

అనేక ఎన్నికల్లో విజయం సాధించిన విధంగానే డిసిసిబి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ సంపూర్ణ విజయం సాధిస్తుందనే ధీమాను కెటిఆర్ వ్యక్తం చేశారు.ఇప్పటికే ధికంగా డైరెక్టర్లుగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. డైరెక్టర్లు అధికంగా టిఆర్‌ఎస్ గెలవడంతో డిసిసిబి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలిపారు. టిఆర్‌ఎస్‌కు అన్నిడిసిసిబిల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరిగే విధంగా ఎన్నికల పరిశీలకులు వ్యవహరించాలని కెటిఆర్ చెప్పారు. డిసిసిబి ఛైర్మన్, డిసిసిబి వైస్ ఛైర్మన్, డిసిఎంఎస్ ఛైర్మన్, డిసిఎంఎస్ వైస్‌ఛైర్మన్ ఎన్నికల్లో జిల్లామంత్రి, స్థానిక శాసనసభ్యులతో కలిసి కార్యాచరణ రూపొందించుకుని సమన్వయంతో వెళ్లాలని కెటిఆర్ ఆదేశించారు.

పార్టీ నిర్ణయించిన వ్యక్తులే ఛైర్మన్లుగా,వైస్ ఛైర్మన్లుగా ఎన్నికవుతారని ఆయన చెప్పారు.సీల్డ్ కవర్‌లో ఉన్నపేరును ఎన్నికల సమయంలోనే ప్రకటించాలని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో ముందుగా పేర్లు లీక్ కావద్దని కెటిఆర్ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే భారీగా డైరెక్టర్లను టిఆర్‌ఎస్ గెలుచుకుందని గుర్తు చేస్తూ డిసిసిబి ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల,డిసిఎంఎస్ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్‌లు కూడా టిఆర్‌ఎస్ సంపూర్ణంగా గెలుచుకుంటుందని చెప్పారు. ఎన్నికైన డైరెక్టర్లకు కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమీకరణలతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కని డైరెక్టర్లకు భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

టిఆర్‌ఎస్ పార్టీ డిసిసిబి,డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లాల పరిశీలకులు
నిజమాబాద్: సివిల్‌సప్లైయ్ కార్పొరేషన్ ఛైర్మన్. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్: టిఎస్ ఐఐసి కార్పొరేషన్ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు
ఆదిలాబాద్: పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. కోలేటి
దామోదర్ గుప్తా
రంగారెడ్డి: శాసనమండలి విప్. ఎంఎస్ ప్రభాకర్
నల్గొండ: ఎంఎల్‌సి. శేరి సుభాష్ రెడ్డి
మెదక్: ఎంపి. బడుగుల లింగయ్య యాదవ్
ఖమ్మం: టిఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి నూకల సురేష్ రెడ్డి
మహబూబ్‌నగర్: ఎంపి బండప్రకాష్
కరీంనగర్: ఎంఎల్‌సి. నారదాసు లక్ష్మణ రావు

DCCB candidates in sealed covers

The post సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: