డిసెంబర్‌లో భారత్ జిడిపి 4.7 శాతం

  క్యూ2తో పోలిస్తే స్వల్పంగా మెరుగుదల సిఎస్‌ఒ వెల్లడి న్యూఢిల్లీ: డిసెంబర్ ముగింపునాటి త్రైమాసికంలో భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 4.7 శాతం నమోదైంది. అంతకుముందు క్యూ2(జులైసెప్టెంబర్)లో 4.5 శాతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగుపడింది. శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) ఈ గణాంకాలను విడుదల చేసింది. గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.7 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 5.6 శాతంగా ఉంది. ఎన్‌ఎస్‌ఒ […] The post డిసెంబర్‌లో భారత్ జిడిపి 4.7 శాతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యూ2తో పోలిస్తే స్వల్పంగా మెరుగుదల
సిఎస్‌ఒ వెల్లడి

న్యూఢిల్లీ: డిసెంబర్ ముగింపునాటి త్రైమాసికంలో భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 4.7 శాతం నమోదైంది. అంతకుముందు క్యూ2(జులైసెప్టెంబర్)లో 4.5 శాతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగుపడింది. శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) ఈ గణాంకాలను విడుదల చేసింది. గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.7 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 5.6 శాతంగా ఉంది. ఎన్‌ఎస్‌ఒ జిడిపి వృద్ధి రేటును 2019-20 మొదటి త్రైమాసికంలో 5.6 శాతానికి, రెండో త్రైమాసికంలో 5.1 శాతానికి సవరించింది. ఎన్‌ఎస్‌ఒ గత నెల రెండో ముందస్తు అంచనాలో 2019-20లో 5 శాతం ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేసింది. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 5శాతం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.

ఇవి కాకుండా బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రాథమిక పరిశ్రమల వృద్ధి ఈ ఏడాది జనవరిలో 2.2 శాతానికి పెరిగింది. విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, గత ఏడాది జనవరిలో ప్రాథమిక పరిశ్రమల వృద్ధి రేటు 1.5 శాతం. బొగ్గు, శుద్ధి ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి వరుసగా 8 శాతం, 1.9 శాతం, 2.8 శాతం పెరిగాయి. ముడి చమురు, సహజవాయువు, ఎరువుల రంగం ఈ నెలలో క్షీణతను నమోదు చేసింది. అయితే జిడిపి గణాంకాలు వెల్లడించడానికి ముందే స్టాక్ మార్కెట్లో తీవ్ర కలకలం రేగింది. ఇది కరోనా వైరస్ వల్ల సంభవించింది. భారీ అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఇది పుంజుకునే దశ: కేంద్రం
జిడిపి 4.7 శాతానికి పడిపోయి ఏడేళ్ల కనిష్టానికి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందిస్తూ, ఆర్థిక వ్యవస్థలో వృద్ధి క్షీణత పుంజుకునే దశకు శ్రీకారం అని పేర్కొంది. రెండో త్రైమాసికంతో పోలిస్తే కాస్త మెరుగుపడినప్పటికీ గతేడాదితో పోలిస్తే జిడిపి అధ్వాన్నంగానే ఉంది. దీంతో ఆర్థికమంత్రిత్వశాఖ ఈవిధంగా స్పందించింది.

India GDP growth at 4.7% in December

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిసెంబర్‌లో భారత్ జిడిపి 4.7 శాతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: