లెఫ్టెనెంట్ గవర్నర్ పర్యటన

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుక్రవారం పర్యటించి వాస్తవ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ పోలీసులు వెంటరాగా బైజాల్ మౌజ్ పూర్, జఫ్రాబాద్, గోకుల్‌పురి ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత సోమవారం అల్లర్లు చెలరేగిన తర్వాత లెఫ్టెనెంట్ గవర్నర్ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించడం ఇదే మొదటి సారి. ఈ మత ఘర్షణల్లో ఇప్పటివరకు 42 మంది చనిపోగా, 200 మందికి పైగా […] The post లెఫ్టెనెంట్ గవర్నర్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుక్రవారం పర్యటించి వాస్తవ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ పోలీసులు వెంటరాగా బైజాల్ మౌజ్ పూర్, జఫ్రాబాద్, గోకుల్‌పురి ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత సోమవారం అల్లర్లు చెలరేగిన తర్వాత లెఫ్టెనెంట్ గవర్నర్ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించడం ఇదే మొదటి సారి. ఈ మత ఘర్షణల్లో ఇప్పటివరకు 42 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అల్లర్లలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, ఖురేజి ఖాస్, బజన్‌పుర ఉన్నాయి. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో మంత్రి గోపాల్ రాయ్‌లు కూడా ఇటీవల అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

Lt Governor Anil Baijal interacts with locals in Maujpur

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లెఫ్టెనెంట్ గవర్నర్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: