యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..?

 ఈ నెలాఖరులో ప్రస్తుత ఇఒ పదవీ విరమణ ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ ఉన్నత స్థాయి అధికారిని కోరుకుంటున్న భక్తులు యాదాద్రి : సిఎం కెసిఆర్ మహా సంకల్పంతో మహా క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య క్షేత్రానికి ఇకపై ఐఎఎస్ అధికారి పర్యవేక్షణలో నిర్వహణ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ఆలయ అభివృద్దికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయ పునఃనిర్మాణ అభివృధ్ధికి వేల కోట్లను బడ్జెట్‌లో ప్రకటించి […] The post యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 ఈ నెలాఖరులో ప్రస్తుత ఇఒ పదవీ విరమణ
ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ఉన్నత స్థాయి అధికారిని కోరుకుంటున్న భక్తులు

యాదాద్రి : సిఎం కెసిఆర్ మహా సంకల్పంతో మహా క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య క్షేత్రానికి ఇకపై ఐఎఎస్ అధికారి పర్యవేక్షణలో నిర్వహణ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ఆలయ అభివృద్దికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయ పునఃనిర్మాణ అభివృధ్ధికి వేల కోట్లను బడ్జెట్‌లో ప్రకటించి యాదాద్రిగా ఆలయ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ అభివృధ్ధికి వైటిడిఎ అథారటీ కమిటీని వేసి, కమిటీ చైర్మన్‌గా సిఎం ఉన్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని వైస్ చైర్మెన్‌గా నియమించారు.

ఆలయాన్ని పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం కృష్ణ శిలతో శిల సంపదతో నిర్మాణం చేపట్టి మహా క్షేత్రానికి రూపం కల్పించారు. ఇప్పటికే ప్రధాన ఆలయ పనులు పూర్తికావస్తున్నాయి. యాదాద్రి క్షేత్రంతో పాటు ఆలయ ప్రాంతం చుట్టూ 5 కిలో మీటర్లు ఆధ్యాత్మికతను చాటేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలమ పర్యవేక్షణ ఒక ఐఎఎస్ అధికారితో ఉంటుందని అన్ని శాఖల విభాగాలు ఈ అభివృధ్ధిలో భాగస్వాములు అవుతారని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆలయ ఇఒగా గ్రూప్-2 అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఇఒ గీత ఈ నెల చివరన పదవీ విరమణ చేయన్నును. ఈ క్రమంలో యాదాద్రి క్షేత్రానికి ఐఎఎస్ అధికారిని ఆలయ ఇఒగా నియామకం చేయవచ్చని భావిస్తున్నారు. ఆరేళ్లుగా గీతనే ఇఒగా ఉన్నారు. ఈ నెలలో గీత పదవీ విరమణ చేస్తుండటంతో ఆమె స్థానంలో ఐఎఎస్ నియమితులవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మోత్సవాల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్…?

ఆలయ ఇఒ పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్ పర్యవేక్షణలో సాగుతున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు , ఇతర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో ఈ నెల 20న కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం చూస్తుంటే ఇకపై కలెక్టర్ పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కొనసాగనున్నది. ఇటీవల రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీ జరిగినా యాదాద్రి జిల్లా కలెక్టర్ బదిలీ కాకపోవడం ఈ అంశాన్ని మరింత బలపరుస్తుంది.

IAS Officer As A Yadadri EO

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: